పార్లమెంటరీ సంయుక్త కమిటీ భువనేశ్వర్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

పార్లమెంటరీ సంయుక్త కమిటీ భువనేశ్వర్‌ పర్యటన

Aug 31 2026 1:32 AM | Updated on Aug 31 2026 1:32 AM

ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల జీతాలు, భత్యాలపై చర్చలు

భువనేశ్వర్‌: జీతాలు, భత్యాల పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఆదివారం భువనేశ్వర్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర శాసన సభ సభ్యుల జీతాలు, ఇతర భత్యాలు, అలాగే మాజీ ఎమ్మెల్యేల ఫించను, భత్యాలపై స్పీకర్‌ సురమా పాఢి శాసన సభ వ్యవహారాల మంత్రి డాక్టర్‌ ముఖేష్‌ మహాలింగ్‌, శాసన సభ కార్యదర్శి సత్యబ్రత్‌ రౌత్‌, ఇతర అధికారులతో విడివిడిగా కూలంకషంగా ఈ కమిటీ చర్చలు జరిపింది. రాష్ట్ర ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాలు, భత్యాలు, అనుబంధ ప్రయోజనాలపై సంయుక్త కమిటీ తులనాత్మక నివేదికను పార్లమెంటులో సమర్పిస్తుంది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు ఇస్తున్న జీతాలు, భత్యాలను మార్చాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. కమిటీ చైర్మన్‌ ఎంపీ బీరేంద్ర ప్రసాద్‌ వైశ్యతో పాటు ఎంపీలు విజయ్‌ కుమార్‌ దుబే, వీణా దేవి, కె.గోపీనాథ్‌, బాబు సింగ్‌ కుష్వాహా, రిచర్డ్‌ భమిలహమ్నాంగియా, పార్లమెంట్‌ డైరెక్టర్‌ భత్శాల జోషి భువనేశ్వర్‌కు విచ్చేసిన బృందంలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement