రాయగడ: విద్యార్థులకు మెరుగైన కేరీర్ అవకాశాలు కల్పించడం, ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో బలమైన సంబంధాలు కొనసాగించడం, క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నందుకు జిల్లాలోని గుణుపూర్‌లో ఉన్న గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మమైన గౌరవం దక్కింది. తూర్పు భారతదేశంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, కార్పొరేట్ రిలేషన్స్ విభాగాల్లో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా ఇండియా బ్రాండ్ ఐకాన్ అవార్డు–2026ను వర్సిటీ అందుకుంది. ముంబైలో టైమ్ సూఐబర్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవార్డు ప్రదానోత్సవంలో విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు డాక్టర్ చంద్రధ్వజ పండ ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. వి ద్యార్థుల భవిష్యత్ కేరీర్‌ను తీర్చిదిద్దడంలో విశ్వవిద్యాలయం చేస్తున్న కృషి, పరిశ్రమలతో ఏర్పరుచుకున్న బలమైన అనుబంధాలు, నాణ్యమైన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు గుర్తింపుగా అవార్డు లభించింది. విద్యా, ఉపాధి అవకాశాలు, కార్పొ రేట్ అనుసంధానం వంటి రంగాల్లో జీఐఈటీ యూనివర్సిటీ సాధిస్తున్న ప్రగతికి ఈ అవార్డు మరో ముఖ్యమైన మైలు రాయిగా నిలిచింది.


