పర్లాకిమిడి: స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా న్యాయసేవా ప్రాధికరణ గజపతి జిల్లా జడ్జి, డి.ఎల్.ఎస్.ఎ అధ్యక్షుడు జగదీష్ ప్రసాద్ మహంతి ఆదేశాల మేరకు న్యాయ సచేతన కార్యక్రమన్ని కార్యదర్శి బిమల్ రౌళో ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ న్యాయ అవగాహన సదస్సులో సీనియర్ న్యాయవాది ఆర్.బాబూరావు, సఖీ వన్ స్టాఫ్ సెంటర్ అడ్మిన్‌స్ట్రేటర్ సునీతా రోథో, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. సుప్రీం కోర్టు ఇటీవల ఇంగ్లిషులో విడుదల చేసిన వివిధ తీర్పులను (ఏఐ) ఆధారంగా ప్రాంతీయ భాషల్లోకి అనువదించడానికి ‘విధిక్’ అనువాద సాఫ్ట్‌వేర్ (సువాస్)ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. దీంతో పాటు ఒడిశా హైకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ కోర్టు రూల్స్ 2020కి సులభతరమైన ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, సివిల్ ప్రోసీజ్యూర్స్ ఏ.డి.ఆర్. చట్టాలు 2007పై ఈ సదస్సులో డి.ఎల్.ఎస్.ఎ కార్యదర్శి బిమల్ రౌళో అవగాహన కల్పించారు.


