నిబద్ధతతో పనిచేయాలి: గవర్నర్‌ | - | Sakshi
Sakshi News home page

నిబద్ధతతో పనిచేయాలి: గవర్నర్‌

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

భువనేశ్వర్‌: ప్రజోపయోగ పాలనపై నిబద్ధత పౌరులు సంక్షేమ పథకాల ప్రయోజనం పొందేలా చేస్తుందని గవర్నర్‌ డాక్టరు హరి బాబు కంభంపాటి యువ అధికారులకు ప్రబోధించారు. ఒడిశా రెవెన్యూ సర్వీస్‌ (ఓఆర్‌ఎస్‌) ప్రొబేషనర్లతో లోక్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన సంభాషణ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరినీ అవగాహన పరిచి ప్రోత్సహించడం ఓఆర్‌ఎస్‌ రంగంలో ఉన్నతమైన సంతృప్తిని మిగుల్చుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగ రంగంలో అర్థవంతమైన సేవలకు జ్ఞానం, అనుభవంతో వృత్తి విలువలతో ముందుకు సాగాలని గవర్నర్‌ యువ అధికారులను అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement