కొరాపుట్: ప్రజాసంక్షేమమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధ్యేయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ అన్నారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాల్‌లో జరిగిన సీనియర్ సిటిజన్ల సమావేశంలో ప్రసంగించారు. గత 12 ఏళ్లలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రెండేళ్లలో రాష్ట్రంలో మోహన్ చరణ్ మజ్జి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. సుభద్ర పథకం కింద మహిళలకు ఆర్థిక సహాయం, ధాన్యానికి రూ.3,200 మద్దతు ధర, విద్యా, ఉపాధి రంగాలలో అభివృద్ధి, నబరంగ్‌పూర్–జయపూర్ రైల్వే లైన్ నిర్మాణం, నబంగ్‌పూర్ జిల్లాలో మెడికల్ కలేజీకి శంకుస్థాపన వంటి విషయాలను వివరించారు. ఈ సమావేశంలో ఎంపీ బలభద్ర మజ్జి, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కుంజ దాస్, రమేష్ సాహు, తదితరులు ప్రసంగించారు.


