సంతబొమ్మాళి: మండలంలోని గోవిందపురం గ్రామానికి చెందిన రెయ్యమ్మ తల్లి యూత్ హెల్పింగ్ హార్ట్స్ సేవా సొసైటీ సభ్యులు ఉన్నత చదువులకు ఆర్థిక సాయం మంగళవారం అందజేశారు. మండలంలోని పాత మేఘవరం ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని బైపల్లి రవణమ్మ ఉన్నత చదువులు పేదరికంతో నిలిచిపోయాయి. విద్యార్థిని తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో ఇక చదువులకు స్వస్తి చెప్పాలని అనుకున్నారు. దీనిపై రెయ్యమ్మ తల్లి యూత్ హెల్పింగ్ హార్ట్స్ సేవా సొసైటీ సభ్యులు స్పందించారు. ఉన్నత చదువులు సాగించడానికి రూ.10 వేలు నగదు, రూ.2 వేలు విలువ కలిగిన పుస్తకాలు అందజేశారు. భవిష్యత్‌లో తమ వంతుగా సహకారం అందిస్తామని తెలిపారు.


