శ్రీకాకుళం అర్బన్: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఏపీ ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.వేణుగోపాల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో జరిగింది. జిల్లా అధ్యక్షురాలిగా శోభారాణి (సీడీపీఓ గార), ప్రధాన కార్యదర్శిగా ఉమాజానకి (సీడీపీఓ కొత్తూరు), కోశాధికారిగా ఎం.రాజేశ్వరి, (సీడీపీఓ ఇచ్చాపురం), వైస్ ప్రెసిడెంట్లుగా శోభారాణి, పాపునాయుడు, జాయింట్ సెక్రటరీగా మణెమ్మ, అనురాధ, కార్యవర్గ సభ్యులుగా గీత, బీవీ లక్ష్మి, రూపలత, వంశీ ప్రియా తదితరులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎన్‌జీజీవో సంఘ పట్టణ అధ్యక్షుడు బొచ్చ శ్రీనివాసరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ జేఏసీ జాయింట్ సెక్రెటరీ విద్య తదితరులు పాల్గొన్నారు.


