ఇద్దరు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు అరెస్ట్‌

Jun 30 2026 12:54 AM | Updated on Jun 30 2026 12:54 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రసాద్‌ జువెలర్స్‌లో 2021లో 700 గ్రాముల బంగారు ఆభరాణాలను దొంగలించిన కేసులో సోమవారం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసిశారు. ప్రసాద్‌ జువెలర్స్‌కు ఇద్దరు వ్యక్తులు వచ్చి నగలు చూసి కొనుగోలు చేస్తామన్నారు. నగలు చూపిస్తున్న సమయంలో జువెలర్స్‌ షాప్‌ యజమాని సుభాష్‌ పటేల్‌కు దేవుని ప్రసాదమని చెప్పి అందులో మత్తు మందు కలిపారు. అది తిన్న యజమాని, సిబ్బంది సృహ కోల్పాయారు. నగలు దోచుకోని నిందితులు పారారయ్యారు. యజమాని సుభాష్‌ మల్కన్‌గిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తుండగా 6 ఏళ్లు గడిచింది. మల్కన్‌గిరి ఆదర్శ పోలీసులు దర్యాప్తును ప్రారంభించగా ఆంధ్రా ప్రదేశ్‌లో గుంటూరుకు చెందిన మదాసు జాన్‌ అలియాస్‌ జగదీష్‌, ఇంటూరి అరుణ అలియాస్‌ అర్చనలను గుర్తించారు. వీరి కోసం గాలించి కన్యకూమారీలో ఉన్నట్లు తెలుసుకున్నారు. పోలీసు బృందం అక్కడికి వెళ్లి శనివారం వారిని పట్టుకున్నారు. ఇద్దరిని సోమవారం మల్కన్‌గిరి తీసుకువచ్చి ఎస్పీ వినోద్‌ పటేల్‌ ఎదుట హాజరుపరిచారు. నిందితులపై కేసు నమోదు చేసి వారి నుంచి 200 గ్రాముల కలిగించిన బంగారం, రెండు ఫిస్టళ్లు, ఆరు బులేట్స్‌, బైక్‌, లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని ఎస్పీ వినోద్‌ పటేల్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement