టెన్త్‌లో ప్రతిభ చూపిన వారికి పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌లో ప్రతిభ చూపిన వారికి పురస్కారాలు

Jun 30 2026 12:54 AM | Updated on Jun 30 2026 12:54 AM

పర్లాకిమిడి: పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు, ప్రతిభ కనబరచిన విద్యార్థులకు స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో మేధాభృతి సమ్మాన్‌ పురస్కారాల వితరణ సభ సోమవారం జరిగింది. ఏటా ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేసి ఈ ఉపకారవేతనాలు దాతలు అందజేస్తున్నారు.

ఈ ఏడాది పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పదకొండు మంది విద్యార్థులకు సామినేని ఆవార్డు, ఉదయ్‌ కుమార్‌ హోత్తా ఆవార్డు, కీ.శే.మహేష్‌ పాఢి, రాజేంద్రనాథ్‌ పాఢి, రమా పాఢి, డి.సూరప్పడు మాస్టారు, మనోరమా స్మృతి అవార్డుల కింద రూ. 3500, రూ.2000, రూ.1000, రూ.300 లెక్కన ప్రభుత్వ మహారాజా బాలుర ఉన్నత పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement