కళా, చారు కళా కళాశాలలో మహారాజ్ విక్రమదేవ్ వర్మ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. కళాశాలలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విక్రమ్ కళా, చారు కళా మహావిద్యాలయ ప్రిన్సిపాల్ యుధిష్టర్ మల్లిక్ అధ్యక్షతన జరిగిన జయంత్యుత్సవంలో ఉపాధ్యక్షుడు సాహితీ వేత్త డాక్టర్ సుధాంశు శేఖర మహాపాత్ర ప్రసంగిస్తూ మహారాజ్ విక్రమదేవ్ వర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. జయపురం సాహితీ సంస్థ పూజ్య పూజ సంసద్ వారు మహారాజ విక్రమదేవ్ వర్మ 158 వ జయంతిని ఘనంగా జరిపారు. స్థానిక విక్రమదేవ్ వర్మ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గల విక్రమదేవ్ కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఉత్కళ సమ్మిళినీ కొరాపుట్ యూనిట్ జయపురం వారు మహారాజ్ రాజర్షి విక్రమదేవ్ వర్మ జయంతి సందర్బంగా ఆయన ప్రతిమకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే జయపురం సాహితీ పరిషథ్, ఒడిశా సాహిత్య ఎకాడమీలు సంయుక్తంగా జయపురంలో నివాళులు అర్పించారు.
జయపురం: జయపురం మహారాజు రాజర్షి విక్రమదేవ్ వర్మ 158 వ జయంతి వేడుకలను స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. విశ్వవిద్యాలయ అడ్మినిస్ట్రేటివ్ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టార్ మహేశ్వర చంద్ర నాయిక్ అతిథులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీపీజీసీ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో రాజర్షి విక్రమదేవ్ వర్మ విద్యా ప్రగతికి అందించిన సేవలను వివరించారు. ముఖ్యవక్తగా పాల్గొన్న ప్రముఖ సాహితీ వేత్త లక్ష్మీకాంత పాఢీ మాట్లాడుతూ రాజర్షి విక్రమదేవ్ వర్మ జీవనం, సాహిత్యం, విద్యారంగానికి అందించిన సేవలు వివరించారు. మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న నేషనల్ అల్యూమిన లిమిటెడ్(నల్కో) కార్యనిర్వాహక డైరెక్టర్ అమరేంధ్ర కుమార్ మిశ్ర ప్రసంగిస్తూ విద్యపై విక్రమదేవ్ వర్మ దూరదృష్టి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ఆయన సేవలు గుర్తు చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విక్రమదేవ్ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ హృషికేష్ శనాపతి తన ప్రసంగంలో విక్రమదేవ్ ఆశయాలు నేరవేర్చేందుకు విద్య, పరిశోధన, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు మరింతగా బలోపేతం చేయాలని పిలుపు నిచ్చారు.
పలు విద్యా సంస్థల ఆధ్వర్యంలో..
విక్రమదేవ్ వర్మ విద్యా ప్రధాత అని బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీ సామ్రాట్ అని పలువురు వక్తలు కొనియాడారు. సాహితీ సామ్రాట్ విక్రమదేవ్ వర్మ 158 వ జయంతి సందర్బంగా జయపురం పట్టణంలో పలు సంస్థలు విద్యాలయాలు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. స్థానిక విక్రమ


