వివాదాస్పదం | - | Sakshi
Sakshi News home page

వివాదాస్పదం

Jun 30 2026 12:25 AM | Updated on Jun 30 2026 12:25 AM

గంజాయి స్వాధీనం

భువనేశ్వర్‌: చతుర్థామ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న శ్రీ జగన్నాథుని దేవ స్థానంలో భగవంతుని సమక్షంలో అందరూ సమానులే అన్న సంస్కృతి బలంగా ఆచరణలో కొనసాగుతుంది. రథ యాత్ర వంటి ప్రముఖ ఉత్సవాల సందర్భాల్లో ఈ ఆచారం పటిష్టంగా అమలు చేసేందుకు అప్పటి ప్రభుత్వం 2016 సంవత్సరంలో దర్శన నియమావళి అమలు చేసింది. ఈ నియమావళి ప్రకారం స్నాన మండపంపై కొలువు దీరిన మూల విరాటులకు దూరం నుంచి దర్శించుకోవలసి ఉంది. దీని కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక కంచె ఆవలి నుంచి ఎవరైనా దర్శించుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగిన శ్రీ జగన్నాథుని స్నాన యాత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి స్నాన మండపంపై మూల విరాటుల స్పర్శతో దర్శించుకున్నట్లు ఆరోపణ. జగతి నాథుని స్నాన సన్నాహాలు జరుగుతున్న తరుణంలో స్వామికి వెన్ను చూపి భగవంతుని దర్శనంతో తరించేందుకు తరలి వచ్చిన అశేష భక్తజనానికి అభివాదం చేయడం అపచారంగా పెదవి విరిచారు. ఈ చర్య భగవంతుని సమక్షంలో అంతా సమానులే అన్న సనాతన ధర్మం విలువలు నీరుగారి పోయాయని కొన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

చెట్టును ఢీకొట్టిన బైక్‌

ఒకరి మృతి

మల్కన్‌గిరి: చెట్టును ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితి ధర్మాపల్లి గ్రామం వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకోగా.. బిమాల్‌ రాజ్‌ (30) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పెద్ది బిమాల్‌ రాజ్‌ ధర్మాపల్లి గ్రామానికి చెందిన బిమాల్‌ రాజ్‌ పోడియా ఆరోగ్య కేంద్రంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. నైట్‌ డ్యూటీ కోసం ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరాడు. మార్గమధ్యలో చీకటి కారణంగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కొద్దిసేపటి తరువాత అటుగా వచ్చి న వారు చూసి రక్తపు మాడుగులో పడివున్న బి మాల్‌ను పోడియా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోడియా పోలీసు ఐఐసీ సంతోష్‌ కుమార్‌ మా ఝి ఆరోగ్య కేంద్రానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసునమోదు చేవారు. మృతదేహాన్ని సోమవారం ఉదయం కలిమెల ఆరోగ్య కేంద్రానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

రాయగడ: రాయగడ నుంచి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు అక్రమంగా గంజాయి తరలించేందుకు సన్నహాలు చేసిన నిందితుడిని జిఆర్‌పి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడు గుంటూరుకు చెందిన పోలాపు కృష్ణగా గుర్తించారు. అతని నుంచి 3.500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. జిఆర్‌పి డీఎస్పీ ప్రభాత్‌ కుమార్‌ త్రిపాఠి ఆదేశానుసారం ఐఐసీ వినయ్‌ కుమార్‌ మిర్జ్‌, ఎస్‌ఐ సంతోష్‌ కుమార్‌ పరిడ, ఏఎస్‌ఐ మానిక్‌ చంద్ర గౌడొలు స్థానిక రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ప్లాట్‌ఫారం వద్ద అనుమానస్పదంగా కనిపించే పోలాపు కృష్ణ వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేశారు. బ్యాగు లో గంజాయి లభ్యమైంది. రాయగడ నుంచి గుంటూరుకు గంజాయిని తరలిస్తున్నట్లుగా నిందితుడు అంగీకరించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement