డిగ్రీ ప్రారంభించాలని విద్యార్థుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ ప్రారంభించాలని విద్యార్థుల ఆందోళన

Jun 30 2026 12:25 AM | Updated on Jun 30 2026 12:25 AM

జయపురం: జయపురం మహారాజు సామ్రాట్‌ విక్రమదేవ్‌ వర్మ స్థాపించిక జయపురం విక్రమ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌ కళాశాలలో డిగ్రీ క్లాసులు తెరవాలని ఆ కళాశాల విద్యార్థులు డిమాండ్‌ చేస్తూ కళాశాల ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. దక్షిణ ఒడిశాలో అనేక మంది నిరుపేద విద్యార్థులు +2 తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ చదివేందుకు సుదూర ఖలికొట్‌, భువనేశ్వర్‌ లకు వెళ్లలేకపోతున్నారని ఇదివరకే ఇక్కడి వారు సర్కారుకు విన్నవించారు. డిగ్రీ కళాశాల నిమిత్తం గుర్తించిన స్థలాన్ని 2026–27 విద్యాసంవత్సరంలో అప్పగించాలని కోరారు. కాలేజీలో అంతర్జాతీయ స్థాయి చారు కళా ప్రదర్శన కోసం గ్యాలరీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆక్రమణలు తొలగించాలని, తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని కోరారు. ఈ ఆందోళనకు ఎమ్మెల్యే తారా ప్రసాద్‌ బాహిణీపతి మద్దతు తెలిపారు. తాను ఎన్నాళ్ల నుంచో కళాశాలలో డిగ్రీ క్లాసులు ప్రారంభించాలని, కళాశాల ప్లాటినమ్‌ జూబ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నానని, అందుకు రూ.15 లక్షలు మంజూరు చేయించానని వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement