యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

పర్లాకిమిడి: గజపతి జిల్లాలో యువ పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం బ్యాంకు రుణాలు కల్పించి, అనేక రాయితీలు ఇవ్వాలని అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధితోపాటు పలువురికి ఉపాధి లభిస్తుందని సెంటర్‌ ఫర్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ కార్యదర్శి అడ్డాల జగన్నాథ రాజు అన్నారు. అంతర్జాతీయ జిల్లా సూక్ష్మ, మధ్య, బృహత్తర ఎంటర్‌ప్రైజర్స్‌ దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఆర్‌శెఠ్టి భవనంలో ‘ఉద్యామీ ఒడిశా, జిల్లా సూక్ష్మ, బృహాత్తర, మధ్యమ ఎంటర్‌ప్రైజెస్‌’ ఐదు రోజుల వర్క్‌షాపును జిల్లా ఉద్యావనశాఖ, డిప్యూటీ డైరెక్టర్‌ జుస్మంత బెహరా ప్రారంభించారు. జిల్లా వ్యవసాయ అధికారి రబీంద్రకుమార్‌ అధెక్‌, జిల్లా పారిశ్రామిక శాఖ జి.ఎం.బిభురంజన్‌ స్వయిని, మిషన్‌ శక్తి ఓ.ఎల్‌.ఎం టిమోన్‌ బరా, ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు మ్యానేజర్‌ ఆశిత్‌ కుమార్‌ జెన్నా, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. జిల్లా పారిశ్రామిక శాఖ జి.ఎం బిభూ రంజన్‌ స్వయిని మాట్లాడుతూ.. గజపతి జిల్లాలో 76 క్యాష్యూ ఇండస్ట్రీలు, 14 గ్రానైట్‌ పరిశ్రమలు, గుసాని సమితిలో కోస్టల్‌ బయోటెక్‌ ప్రైవేటు లిమిటెడ్‌, మరో 60 కుటీర పరిశ్రమలు ఉన్నాయన్నారు. గజపతిజిల్లాలో ఎక్కువగా మొక్కజొన్న తర్వాత అనాసపనస, చింతపండు, మామిడి, పనస పంట సాగుచేస్తున్నారని, జిల్లాలో కోల్డు స్టోరేజీ లేకపోవడం వల్ల శ్రీకాకుళంలో ఉన్న కోల్డు గిడ్డంగులకు ఇక్కడి నిల్వలు ఉంచుతున్నారని సిసిడి సంస్థ అధినేత ఎ.జగన్నాథ రాజు అన్నారు. గజపతి జిల్లాలో కొత్తగా డ్రాగన్‌ ఫ్రూట్‌, ఖోఖో, లిచ్చి ఉద్యానవనాలను గిరిజన రైతులు పండిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement