చట్టాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్‌లో నాన్‌ క్యాడర్‌ ప్రాసిక్యూటర్ల పరిచయం, పునశ్చరణ శిక్షణ కార్యక్రమంలో జిల్లా న్యాయాలయం, హోంశాఖ ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమంలో ఆర్‌.ఉదయగిరి సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి రాజేష్‌ కుమార్‌ మిశ్రా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాసిక్యూషన్సు డిప్యూటీ డైరెక్టరేట్‌ అజిత్‌ పట్నాయక్‌, జిల్లా న్యాయలయం సీనియర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజేష్‌ కుమార్‌ మిశ్రా, ఎం.పృథ్వీరాజ్‌ తదితరులు హాజరయ్యారు. కేంద్ర న్యాయశాఖ ఇటీవల ప్రవేశపెట్టిన క్రిమినల్‌ ప్రోసిడ్యూర్‌ కోడ్‌ బి.ఎన్‌.ఎస్‌., బి.ఎన్‌.ఎస్‌.ఎస్‌. సెక్షన్లను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు కూలషంగా చదివి తదనంతరం కేసులను విచారించాలని అజిత్‌ పట్నాయక్‌ అన్నారు. ఆర్‌.ఉదయగిరి పోలీసు అధికారి రాజేష్‌ కుమార్‌ సాహు కూడా న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కొత్త చట్టాలు అనుసరించి ఫోరెన్సిక్‌, క్రిమినల్‌ సెక్షన్లను తెలుసుకుని కేసులను దర్యాప్తు చేయాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement