ఛాయాగ్రాహకుడు దిలీప్‌ రాయ్‌ ఇక లేరు | - | Sakshi
Sakshi News home page

ఛాయాగ్రాహకుడు దిలీప్‌ రాయ్‌ ఇక లేరు

Jun 28 2026 7:18 AM | Updated on Jun 28 2026 7:18 AM

భువనేశ్వర్‌: ఒడియా చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు దిలీప్‌ రాయ్‌ ఇక లేరు. ఆయనకు 72 ఏళ్ల వయసు. శుక్రవారం రాత్రి స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఇటీవల గుండె పోటు కారణంగా మెదడులో రక్త ప్రసరణ ఆగిపోవడంతో చికిత్స కోసం ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు పూరీ స్వర్గ్‌ ద్వార్‌ లో జరుగుతాయని కుటుంబీకుల సమాచారం.

ఓలీవుడ్‌లో విషాద ఛాయలు

దిలీప్‌ రాయ్‌ 1954 జూలై 27న కటక్‌లో జన్మించారు. 80వ దశకంలో ప్రముఖ దర్శకుడు మన్మోహన్‌ మహా పాత్రో మార్గదర్శకత్వంలో సినిమాటోగ్రాఫర్‌గా ఎదిగారు. బెంగళూరులోని ఎఫ్‌టీఐ నుండి సినిమాటోగ్రఫీ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆయన చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. త్రిసంధ్య, బాజే భంవుషీ నాచే ఘుంగుర్‌, భాగ్య హాతే డోరీ, సునా సిద్ధ, జీవా సాథీ, విధిషేర్‌ బిధాన్‌, ఐత్‌ దునియా, ఫొల్షహరన్‌, చకభానూరి లక్ష్మణ రేఖ, చిన్ని మొదలైన 80కి పైగా ఒడియా చిత్రాలకు పని చేశారు. ఆయన కొన్ని ఛత్తీస్‌గఢీ చిత్రాలకు కెమెరామెన్‌గా కూడా పని చేశారు. ఆయన దూరదర్శన్‌కు కూడా పని చేశారు. ఆయన మరణం ఓలీవుడ్‌లో విషాద ఛాయలను నింపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement