రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కల్యాణవెంకటేశ్వర మందిరం 32వ వార్షికోత్సవాలతో పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగో రొజుకు చేరుకున్నాయి. అత్యంత వైభవంగా స్వామి వారి పూజలు కొనసాగుతున్నాయి. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో మందిర ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపొయింది..బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన ఊంజల్ సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం శ్రీదేవి–భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి దివ్యకల్యాణ మహోత్సవం మందిరానికి సమీపంలోని కల్యాణ మండపంలో అత్యంతభవంగా జరిగింది. మందిర ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణం రమనీయంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దివ్య కల్యాణాన్ని తిలకించిన భక్తులు స్వామి వారి అనుగ్రహంతో సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే మందిరంలో ప్రత్యేక వ్రతాలు, సుదర్శన హోమం, వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. హోమంలొ పాల్గొన్న భక్తులు కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కోసం పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. బ్రహోత్సవాల సందర్భంగా మందిరం ప్రాంగణంలో చిన్నారుల భరతనాట్యం అందరినీ ఆకర్షించింది. ఉత్సవాలను తిలకించేందుకు రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరావు దంపతులు ప్రత్యేక అతిథిగా వెళ్లారు. స్వామి వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా మందిరం పరిచాల కమిటీ అధ్యక్షులు చంద్రమౌలి కుముంధాన్ , కార్యదర్శి శ్రీనివాస్ కుముంధాన్‌లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు రాంజీ ఆచార్యులు నెక్కంటికి శాలువాను కప్పి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు.


