అక్రమంగా తరలిస్తున్న పశువుల స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా తరలిస్తున్న పశువుల స్వాధీనం

Jun 28 2026 7:18 AM | Updated on Jun 28 2026 7:18 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి బలిమెల పట్టణం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా 14 పశువులను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను బలిమెల పోలీసులు శనివారం ఉదయం పట్టుకున్నారు. ఈ పశువులను తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులను విచారించగా వికాష్‌ ఖీలో, ఆర్జున్‌ ఖీలోగా తెలిసింది. వారిపై అక్రమ రవాణా కేసును నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న పశువుల్లో నాలుగు ఎద్దులు, ఒక దూడ, 9 ఆవులు ఉన్నాయి. వీటిని కోరుకొండ పశువైద్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంగా ఉండటంతో మల్కన్‌గిరి పశు సంరక్షణ కేంద్రానికి ప్రత్యేక వాహనంలో తరలించినట్లు బలిమెల ఎస్‌ఐ దేవదత్తు మల్లిక్‌ తెలిపారు.

సారా పట్టివేత

పర్లాకిమిడి: కాశీనగర్‌ సింగిపురం గ్రామంలో ఆదర్శ పోలీసు ష్టేషన్‌ సిబ్బంది శనివారం దాడులు జరిపి వంద లీటర్ల వంట సారా, 600 లీటర్ల ఇప్పసారాను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్టు ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు. గ్రామంలో రైల్వే ట్రాకు వద్ద గోతులు తవ్వి వంటసారా తయారు చేస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు. వీటిలో టైర్లు, ఫినాయిల్‌, విప్పపువ్వు, బెల్లం కలిసి తయారుచేసి అమ్ముతున్నట్టు పోలీసులు తెలియజేశారు. సారా తాగితే అనేక జబ్బులు వస్తాయని ఐఐసీ ప్రశాంత్‌ భూపతి అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

స్కూటీని ఢీకొట్టిన వ్యాన్‌..

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి పట్టణంలోని బలిమెల కూడలి సిగ్నల్‌ వద్ద స్కూటీని నిలిపి ఓ దుకాణానికి జిల్లా అదనపు ట్రెజరీ అధికారి ధర్మేంద్ర శబర్‌ వెళ్లారు. ఆ సమయంలో అతి వేగంగా వెనుక నుంచి ఓ వ్యాన్‌ వచ్చి స్కూటీని ఢీకొట్టి 10 అడుగుల దూరం ఈడ్చుకెళ్లింది. వ్యాన్‌ బియ్యం లోడ్‌తో జయపురం వైపు వెళ్తోంది. ఈ ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వాహనం నడపడమే కారణం. వెంటనే మల్కన్‌గిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ పారారయ్యారు. డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

నిష్పక్షపాత దర్యాప్తు చేయాలి

పర్లాకిమిడి: బాధితులు కోర్టుల్లో న్యాయం కోసం అనేక ఏళ్ళు వేచి చూస్తుంటారు, అలాంటి క్రిమినల్‌ కేసుల్లో పోలీసుశాఖ నిబధ్ధతో కూలషంగా విచారణ జరిపి, సాక్షాలు పోందుపరిచి నిందితులకు శిక్ష పడేలా చూడాలని.. అప్పుడే మీకు ప్రభుత్వం ఇచ్చిన పదవి సద్వినియోగం అవుతుందని జిల్లా జడ్జి జగదీష్‌ ప్రసాద్‌ మహాంతి అన్నారు. జిల్లా జడ్జి జగదీష్‌ ప్రసాద్‌ మహాంతి శనివారం నాన్‌ కేడర్‌ ప్రాసిక్యూటర్ల కోసం పరిచయ మరియు పునశ్చరణ శిక్షణా కార్యక్రమంను ఆయన జిల్లా కలెక్టరేట్‌లో కాన్ఫరెన్సు హాలులో ప్రారంభించారు. ఈ రెండురోజుల శిక్షణా కార్యక్రమానికి డిప్యూటీ డైరక్టరేట్‌ (ప్రాసిక్యూషన్సు) అజిత్‌కుమార్‌ పట్నాయిక్‌, సీనియర్‌ ఆడ్వకేటు రాజేంద్ర ప్రసాద్‌సాహు, జిల్లా ఆదనపు మాజిస్ట్రేటు ఫల్గునీ మఝి, జిల్లా ఎస్పీ ప్రహ్లాద్‌ సహాయ్‌ మీనా, ఎకై ్సయిజు సూపరింటెండెంటు ప్రదీప్‌ కుమార్‌ సాహు, సబ్‌డివిజనల్‌ పోలీసు అధికారి మాధవానంద నాయక్‌, డాక్టర్‌ సంతును పాఢి, ఏ.సి.ఎఫ్‌. బ్రహ్మానంద సాహు, ఇతర నూతనంగా నియమితులైన జి.పి., పి.పి.లు హాజరయ్యారు. ఈ శిక్షణా శిబిరంలో భారతీయ శిక్షాస్మృతిలో వివిధ కొత్త చట్టాలు, సవరణలు వాటి ప్రభావం, అలాగే పాత, క్రొత్త చట్టాల మధ్య తూలనాత్మక అధ్యయనం మరియు కోర్టు ముందు ఫోరెన్సిక్‌ సాక్ష్యాలను ఎలా సిధ్ధం చేయావచ్చో అన్నఅంశంపై చర్చించారు. నేటి కర్మశాలకు సీనియర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజేష్‌ కుమార్‌ మిశ్రా అధ్యక్షత వహించగా, అనేక మంది నాన్‌ క్యేడర్‌ పి.పి.లు హాజరయ్యారు. ఈ శిక్షణ శిబిరం న్యాయశాఖ డైరెక్టరేట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆధ్వర్యంలో జరిగినది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement