హైటెక్‌ గ్రూప్‌నకు విశిష్ట పురస్కారం | - | Sakshi
Sakshi News home page

హైటెక్‌ గ్రూప్‌నకు విశిష్ట పురస్కారం

Jun 28 2026 7:18 AM | Updated on Jun 28 2026 7:18 AM

భువనేశ్వర్‌: ఒడిశా ఆరోగ్య సంరక్షణ రంగంలో విశేష గుర్తింపు సాధించిన హై టెక్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్‌కు ప్రతిష్టాత్మక టైమ్స్‌ హెల్త్‌ ఐకాన్స్‌ ఒడిశా 2026 సత్కారం లభించింది. ఈ సందర్భంగా హై టెక్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, గ్రూప్‌ సీఈఓ సురేష్‌ కుమార్‌ పాణిగ్రాహికి మెడికల్‌ విజనరీ ఫర్‌ సోషల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ అండ్‌ హలో ఎకై ్సట్‌మెంట్‌’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడంలో ఆయన చేసిన అవిశ్రాంత కృషికి గాను సురేష్‌ కుమార్‌ పాణిగ్రాహికి ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ప్రదానం చేశారు. హై టెక్‌ మెడికల్‌ కార్డియాలజీ విభాగం రోగ నిర్ధారణ, చికిత్స, శస్త్ర చికిత్స, రోగి సంరక్షణ రంగాలలో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి స్థానాన్ని కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా హైటెక్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ కార్డియాలజీ (గుండె జబ్బులు) విభాగం రాష్ట్రంలో అగ్ర శ్రేణి ఆస్పత్రిగా అవార్డును ప్రదానం చేశారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును హై టెక్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, గ్రూప్‌ సీఈఓ సురేష్‌ పాణిగ్రాహితో డాక్టర్‌ శ్వేతా దాస్‌, డాక్టర్‌ రితేష్‌ ఆచార్య, మెడికల్‌ సహాయ అధ్యాపకుడు డాక్టర్‌ సీతారాం మహా పాత్రో అందుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement