పర్లాకిమిడి: స్థానిక గజపతి స్టేడియం సమీపంలో ఇండియన్ పెట్రోలియం బంకు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం శనివారం జరిగింది. ఉపాధ్యాయుడు అర్ధత్రాణ పండా (60)నడుచుకుని వెళుతుండగా వెనుక నుంచి ఓ యువకుడు స్పీడుగా వచ్చి బైక్‌తో గుద్దటంతో అక్కడికక్కడే అర్ధత్రాణ పండా మృతి చెందాడు. మృతుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. బైక్‌లో పుడ్డుని గ్రామం నుంచి పర్లాకిమిడి వస్తున్న యవకుడు ఎస్.కిరణ్‌స్వీడుగా వచ్చి టీచర్ అర్ధత్రాణ పండాను గుద్దడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అర్ధత్రాణ పండా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు కిరణ్‌ను అరెస్టు చేసి పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


