సమగ్ర శిక్షలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం: జిల్లా సమగ్ర శిక్షలో ఐఈ కో–ఆర్డినేటర్, అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఏపీసీ వేణుగోపాలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్‌గా ఐదు సంవత్సరాలు, లేనిపక్షంలో ఎస్జీటీలుగా ఎనిమిది సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి ఉండాలని, జనవరి 31 నాటికి 55 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. అన్ని పోస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తప్పనిసరని, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలన్నారు. ఐఈ కోఆర్డినేటర్ పోస్టుకు పీజీతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ కలిగి ఉండాలని చెప్పారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు ఫిబ్రవరి 23 నుంచి 25లోగా సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తులు అందజేయవచ్చని చెప్పారు. దరఖాస్తులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలన్నారు.
నరసన్నపేట: చిక్కాలవలసకు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ దంత అమృత్‌కుమార్ (41) గుండెపోటుతో మణి పూర్‌లో మరణించా రు.ఈయన 20 ఏళ్లుగా మణిపూర్‌లో జవాన్‌గా పనిచేస్తున్నారు. విధు లు నిర్వహించి ఇంటికి చేరిన తర్వాత శుక్రవా రం వేకువజామున గుండెపోటుకు గురై మరణించినట్లు తండ్రి సింహాచలం తెలిపారు. అమృత్‌కుమార్‌కు భార్య జీవిత, కుమారుడు అర్జున్, కుమార్తె అనన్య ఉన్నారు. శనివారం సాయంత్రానికి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంటుందని బంధువులు తెలిపారు. అమృత్‌కుమార్ మృతి పట్ల మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పోలాకి జెడ్‌పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణచైతన్య, ఎంపీపీ ఆరంగి మురళి, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
రణస్థలం: లావేరు మండలం చిన్నయ్యపేట గ్రామానికి చెందిన రెడ్డి రమణ(35) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రమణ భార్య అనారోగ్యంతో బాధపడుతున్నందున ఎచ్చెర్ల మండలం కుప్పిలి మెడికల్ షాపులో మందులు కొనేందుకు బయలుదేరాడు. ఇంతలో ఏం జరిగిందో గానీ లోపెంట పంచాయతీ కరగానిపేట దగ్గరలో రోడ్డుపై విగత జీవిగా పడి ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం 6.15 గంటల సమయంలో స్థానికులు గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రోడ్డుకు తల బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయాడు. తొలుత గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని భావించారు. కొద్ది దూరంలోనే తుప్పల్లో మరో బైక్‌ను గుర్తించారు. బైక్ స్టార్ట్ కాకపోవడంతో తుప్పల్లో పడేసి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. రమణకు భార్య వసంత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లావేరు ఎస్సై కె.అప్పలసూరి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
నేటి నుంచే జాతీయ స్థాయి నాటిక పోటీలు
శ్రీకాకుళం కల్చరల్: సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్‌లో ఈ నెల 21 నుంచి మూడురోజుల పాటు కొన్న చిన్నారావు, చిన్నమ్మడు చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కళాకారులు, ప్రతినిధులకు వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేశామని నిర్వాహకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. కళామందిర్ వద్ద నాటిక పోటీల వివరాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
నాటికలు ఇవే..
●ఈ నెల 21న రాత్రి 7 గంటలకు బొరివంకకు చెందిన శార్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో కేకేఎల్ స్వామి రచన, దర్శకత్వంలో ‘మాయాజాలం’ నాటిక, 8.30 గంటలకు కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ గుంటూ రు వారి ఆధ్వర్యంలో బొమ్మిడి రామకృష్ణ రచన ద ర్శకత్వంలో ‘తరమెల్లిపోతున్నదో’నాటిక ప్రదర్శన.
●22వ తేదీన రాత్రి 7 గంటలకు గుంటూరు అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఎన్.రవీంద్రరెడ్డి దర్శకత్వంలో ‘సమయం’ నాటిక, 8.30 గంటలకు పొ న్నూరు విశ్వకళా చైతన్య వేదిక ఆధ్వర్యంలో జి.వి.మనోహర్ దర్శకత్వంలో ‘సూక్తం’ నాటిక ప్రదర్శన.
●23వ తేదీన రాత్రి 7 గంటలకు విజయవాడ సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఎస్.కోటేశ్వరరావు దర్శకత్వంలో ‘మమ్మల్ని బ్రతకనివ్వండి’ నాటిక, 8.30 గంటలకు విశాఖ, కె.వి.మెమోరియల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో పి.శివప్రసాద్ దర్శకత్వంలో ‘నిన్ను నీ వు గెలుచుకో’ నాటిక ప్రదర్శనలు జరుగుతాయి. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు.
సమగ్ర శిక్షలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


