కార్మిక చట్టాలపై అవగాహన అవసరం
● బొమ్మిక జనచైతన్య సదస్సులో వక్తలు
పర్లాకిమిడి: ప్రవాస వలస కార్మికుల సమస్యలు, బాల్యవివాహాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నల్సా జాగృతి యోజన, జిల్లా లీగల్ సర్వీసెస్ ప్రాధికరణ ఆధ్వర్యంలో రాయఘడ బ్లాక్ బొమ్మిక గ్రామంలో జన చైతన్య సదస్సును శుక్రవారం నిర్వహించారు. సదస్సులో జిల్లా న్యాయ సేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రవుళో, గౌరవ అతిథిగా జిల్లా అదాలత్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా, సహాయ శ్రమ అధికారి మోహన్ టుడు, కిశోర్ న్యాయాలయం క్యాడర్ సభ్యులు భాగ్యలక్ష్మీనాయక్, సర్పంచ్ గిన్ని విమలాదేవి, గురండి ఏఎస్సై శుశాంత దోళాయి, అఖిల భారత యువజన సేవాసమితి ప్రతినిధి కుమార్ రెడ్డి పాల్గొన్నారు. 18 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న మహిళలు గర్భంలో అనేక సమస్యలు ఎదురౌతాయని అందువల్ల ప్రభుత్వం చట్టం చేసిందని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి బిమల్ రవుళో అన్నారు. అలాగే ప్రవాస కార్మికులు ఇతర రాష్ట్రాలు, దేశాలు కూలీ కోసం వలస వెళ్లేటప్పుడు తప్పనిసరిగా జిల్లా కార్మిక ఉపాధి కార్యాలయంలో తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. దీని వల్ల భవిష్యత్తులో అపాయం సంభవించినప్పుడు ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. సదస్సులో జస్టిస్ కార్నర్ ట్రస్టు సభ్యులు జగన్నాథచౌదురి, గిన్ని లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
కార్మిక చట్టాలపై అవగాహన అవసరం


