బురదలో చిక్కుకున్న గున్న ఏనుగు
● రక్షించిన అటవీ సిబ్బంది
భువనేశ్వర్: అంగుల్ జిల్లా శ్యామసుందర్‌పూర్ గ్రామం సమీపంలో ఆహారం కోసం వెతుకుతూ బురదతో నిండిన వరి పొలంలో మగ గున్న ఏనుగు చిక్కుకుంది. 22 ఏనుగుల గుంపు నుంచి ఒంటరై దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఏనుగు పరిస్థితి పట్ల స్థానికులు స్పందించారు. అటవీ శాఖ అంగుల్ రేంజ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. చికిత్స కోసం పురుణాగొడొ సమీపం కులసింఘ జంతు చికిత్స కేంద్రానికి తరలించారు. రాత్రంతా చలిలో గడపడంతో గున్న ఏనుగు బలహీనమైందని అధికారులు తెలిపారు. ఇది సుమారు 15 రోజుల వయస్సు మగ గున్న ఏనుగు అని అంగుల్ డీఎఫ్‌వో నితీష్ కుమార్ తెలిపారు. చికిత్సతో ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. నెమ్మదిగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు.
వాహనం ఢీకొని మతిస్థిమితం లేని వ్యక్తి మృతి
జయపురం: జయపురం–కొరాపుట్ 26వ జాతీయ రహదారి ఘాట్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని మతిస్థిమితం లేని వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో ఘాట్ రోడ్డుపై వ్యక్తి పడిఉండటం చూసిన స్థానికులు బరిణిపుట్ సర్పంచ్ పద్మ నందబాలయ్యకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా.. ఆయన జయపురం సదర్ పోలీసుస్టేషన్ అధికారికి విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేశారు. దీంతో పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని వవ సంరక్షతల గృహంలో ఉంచారు. మృతుని వివరాలు తెలియక పోతే దహన సంస్కారాలు పూర్తిచేస్తామని పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ వెల్లడించారు.
సాగరతీరంలో గుర్తు తెలియని మృతదేహం
భువనేశ్వర్: పూరీ సముద్ర తీరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించారు. సముద్రంలో ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు భావిస్తున్నారు. బలిహర్‌చండి సముద్ర ముఖద్వారం వద్ద మృతదేహం బయటపడింది. శరీరంపై గాయాలు ఉండడంతో హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నాయి. బ్రహ్మగిరి ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎల్‌ఈడీ లైట్లు అందజేత
పర్లాకిమిడి: నువాపడ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జయడోల్కియా తరఫున గత వారం రోజులుగా పర్లాకిమిడి మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్మబంద పంచాయతీలోని కాలనీ వాసులు వీధి లైట్లులేక రాత్రివేల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ విషయం తెలిసి 18 ఎల్‌ఈడీ లైట్లను అక్కడి ప్రజలకు కోడూరు అందజేశారు. నువాపడ అసెంబ్లీ నియోజకవర్గంలో 23 కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బురదలో చిక్కుకున్న గున్న ఏనుగు
బురదలో చిక్కుకున్న గున్న ఏనుగు


