ఘనంగా మత్స్య, పశుపాలన మేళా
జయపురం: స్థానికంగా ఒక కల్యాణ మండపంలో బ్లాక్ స్థాయి మత్స్య, పశుపాలన మేళా–2025 ఆదివారం నిర్వహించారు. బ్లాక్ పశు చికిత్సాధికారి డాక్టర్ సునీల్ కుమార్ నాయిక్ అధ్యక్షతన జరిగిన మేళాలో ముఖ్య అతిథిగా జయపురం సబ్ కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యవక్తగా పశుసంపద విభాగ చీఫ్, జిల్లా పశు చికిత్సాధికారి డాక్టర్ లక్ష్మీధర బెహరా, జయపురం సమితి అధ్యక్షురాలు తిలోత్తమ ముదులి, జిల్లా పరిషత్ సభ్యులు తిపతి పట్నాయిక్, ఎంపీ ప్రతినిధి కృష్ణ చంద్ర నేపక్, ఏబీడీఓ మనోజ్ కుమార్ నాయిక్, ఎస్‌డీబీఓ బిశ్వజిత్ రాయ్, మత్య్స అధికారి సునీల్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ జ్యోతిని వెలిగించి మేళా ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకాల గురించి వివరించారు. నలుగురు ఉత్తమ రైతులు, మరో నలుగురు పాడి రైతులను సత్కరించారు.
ఘనంగా మత్స్య, పశుపాలన మేళా


