గుప్ చుప్ అంగడి సముదాయం
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్ శ్రీ 2025
భువనేశ్వర్‌లో త్వరలో ప్రత్యేక
భువనేశ్వర్: గుప్ చుప్ (పాణీ పూరి) నోరూరించే ప్రముఖ చిరు తిండి. పట్టణ, నగర ప్రాంతాలలో ఎక్కడికక్కడ జన సంచార వీధుల్లో సైకిలు, తోపుడు బండ్లపై విక్రయిస్తారు. ఆబాల గోపాలం గుమిగూడి గుప్ చుప్ కోసం ఎగబాకుతారు. ఇటీవల గుప్ చుప్ వివాహాది శుభ కార్యాలయాల్లో తొలి నోరూరించే పదార్థంగా అతిథుల్ని ఆకట్టుకుంటుంది. క్రమంగా గుప్ చుప్‌కు ఆదరణ పెరగడంతో ఇంటికి వచ్చిపోయే అతిథులకు అందజేసి రుచికరంగా ఆకట్టుకుంటున్నారు. వీధుల్లో రోడ్డు పక్కన ఈ అమ్మకాలను క్రమబద్ధీకరించేందుకు స్థానిక నగర పాలక సంస్థ బీఎంసీ నడుం బిగించింది. ప్రసిద్ధ వీధి చిరుతిండిని (గుప్ చుప్) ఆస్వాదించడానికి అనుకూలమైన, పరిశుభ్రమైన స్థలం కేటాయిస్తుంది. అనధికార తాత్కాలిక అమ్మకపు కేంద్రాలు ట్రాఫిక్ రద్దీని ప్రేరేపిస్తున్నాయి. ఈ సమస్య నివారణకు ప్రయోగాత్మకంగా గుప్ చుప్ అంగడి సముదాయం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు నగర మేయర్ సులోచన దాస్ తెలిపారు. దీని కోసం నగర పాలక సంస్థ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎదురుగా బహిరంగ స్థలం గుర్తించింది. మేయర్ సులోచనా దాస్ ఆ స్థలాన్ని పరిశీలించి ప్రతిపాదిత ప్రణాళికను సమీక్షించారు. సాహిద్ నగర్ స్క్వేర్, నిక్కో పార్క్ మధ్య పనిచేస్తున్న అన్ని గుప్ చుప్ విక్రేతలను గుర్తించి కొత్త వెండింగ్ జోన్ కిందకు తీసుకు వస్తారు. ప్రతి విక్రేతకు ప్రత్యేకంగా రూపొందించిన ట్రాలీని ఉచితంగా అందిస్తారు.
ఓపెన్ వెండింగ్ జోన్ మోడల్ కింద అభివృద్ధి చేసిన ఈ వెండింగ్ జోన్ 30 నుండి 40 స్టాల్స్‌కు వసతి కల్పించగలదని భావిస్తున్నారు. ఈ ప్రాంగణం అందంగా తీర్చిదిద్ది వినియోగదారుల కోసం పార్కింగ్, ఇతర సౌకర్యాల్ని అందుబాటులోకి తేనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రేతలు పనిచేయడానికి అనుమతిస్తారు. సాయంత్రం వేళల్లో తగినంత లైటింగ్ ఏర్పాటు చేస్తారు. పరిశుభ్రత పరిరక్షణ ప్రాధాన్యత దృష్ట్యా విక్రేతలు చేతి తొడుగులు ధరించి గుప్ చుప్ విక్రయిస్తారు. ఈ ప్రాంగణంలో దహీ గుప్ చుప్, పుదీనా గుప్ చుప్ వంటి బహుళ రుచులతో గుప్ చుప్ లభిస్తాయి.
నోరూరించే గుప్ చుప్ ఇదే..
గుప్ చుప్ అంగడి సముదాయం
గుప్ చుప్ అంగడి సముదాయం
గుప్ చుప్ అంగడి సముదాయం
గుప్ చుప్ అంగడి సముదాయం


