ఉచిత న్యాయసేవలపై అవగాహన అవసరం
జయపురం: ఉచిత న్యాయ సేవలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జయపురం జిల్లా సివిల్ కోర్టు రిజిస్టార్, కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం కార్యదర్శి బిష్ణు ప్రసాద్ దేవత అన్నారు. స్థానిక తెలుగు సాంస్కృతిక సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయపురం సిటీ స్కూల్ సభా గృహంలో జిల్లా న్యాయ సేవా ప్రాదీకరణ జయపురం వారిచే జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాలొగన్న ఆయన జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు, న్యాయవాది బిరేష్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బిష్ణు ప్రసాద్ దేవత ప్రసంగిస్తూ.. సమాజంలో అవరమైన వారికి ఉచిత న్యాయ సహాయం, సలహాలు, మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించడమే న్యాయసేవా ప్రదీకరణ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. అందులో భాగంగానే లోక్ అదాలత్‌లు, న్యాయ సేవా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పాఠశాల విద్యార్థినులు ప్రారంభ గీతం ఆలపించారు. సీనియర్ సివిల్ జడ్జి శ్వయం ప్రకాశ్ దాస్, జయపురం సబ్‌డివిజనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సంతోష్ కుమార్ బారిక్, ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌లు మిస్ దీక్ష్యా రౌత్‌రాయ్, మిస్ ప్రజ్ఞా సుమన్ మహాపాత్రో, పోస్కో పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ బి.గాయిత్రీ దేవి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ ప్రమోద్ కుమార్ దాస్లు జాతీయ న్యాయ సేవా కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు. వివరించారు. కార్యక్రమంలో సిటీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు బి.సుజాత, సిటీ ఇంగ్లిష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర పట్నాయక్, తెలుగు సాంస్కృతిక సమితి కమిటీ సభ్యులు ఎ.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ప్రతాప్ పట్నాయక్ పాల్గొన్నారు.
ఉచిత న్యాయసేవలపై అవగాహన అవసరం
ఉచిత న్యాయసేవలపై అవగాహన అవసరం
ఉచిత న్యాయసేవలపై అవగాహన అవసరం


