ఆదివాసీ రైతులను ఆదుకోవాలి
● సీపీఐ ఎంఎల్ లిబరేషన్ డిమాండ్
పర్లాకిమిడి: మోంథా తుపాను ధాటికి గజపతి జిల్లాలోని పలు సమితిల్లో ధాన్యం, మొక్కజొన్న, పత్తిపంటకు తీరని నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితిలో ఆదివాసీ రైతులు, పేదలను ఆదుకోవాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ప్రతిబాద్ ఆందోళన చేపట్టారు. ఆందోళనలో భాగంగా పురపాలక సంఘం నుంచి ఆదివాసీలు సీపీఐ ఎంఎల్ జెండాలు పట్టుకుని కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద లిబరేషన్ కార్యకర్తలు బైఠాయించి రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. గజపతి జిల్లాలో తుపానుతో నష్టపోయిన మొక్కజొన్న రైతులకు ఎకారాకు రూ. 60 వేలు, వరి పంటకు 80 వేలు, పత్తిపంటకు రూ.90 వేలు పరిహారం అందజేయాలన్నారు. అలాగే మొక్కజొ న్న గింజలను కిలో రూ.50 చొప్పున మండీలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అనేక సమితిల్లో తుపానుకు కొండచరియలు విరిగిపడి రోడ్లు పోయాయని, అలాగే కొంత మంది నిరాశ్రయలు అయ్యారని తిరుపతి గోమాంగో అన్నారు. గజపతి జిల్లా మోహానా బ్లాక్ శికులిపదర్ గ్రామంలో ఆదివాసీల పట్టాభూముల్లో గిరిజనేతరులు అనుభవిస్తున్నారని, దీనిని అధికారులు అడ్డుకోవాలని అన్నారు. 2006 జంగిల్ జమ్మి చట్టం అమలు చేయాలని, నువాగడ బ్లాక్‌లో తబరాడ, గువారా గ్రామంలో శ్మశానం భూముల్లో తబరాడ గ్రామంలో 35 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, ప్రధానమంత్రి ఆవాస్‌యోజన ఇల్లు నిర్మాణానికి రూ.5 లక్షలకు పెంచాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి జుధిస్టర మహాపాత్రో కోరారు. మొత్తం 17 డిమాండ్లతో ముఖ్యమంత్రిని ఉద్దేశించి రాసిన వినతిపత్రాన్ని ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగకు రాష్ట్ర కమిటీ సభ్యులు తిరుపతి గోమంగో, సీపీఐ ఎంఎల్ జిల్లా కమిటీ సభ్యులు నర్సింగ మండళ్ అందజేశారు. ఆందోళనలో కృషక్ నేత అశోక్ ప్రధాన్, జిల్లా కమిటీ సభ్యులు కేశవ్ రైయితో, సీపీఐ ఎంఎల్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస బెహారా, అబాసలేం రయితో, మోజేష్ శోబోరో పాల్గొన్నారు.
ఆదివాసీ రైతులను ఆదుకోవాలి
ఆదివాసీ రైతులను ఆదుకోవాలి


