భక్తిశ్రద్ధలతో కార్తీక సోమవారం పూజలు
పర్లాకిమిడి: కార్తీక మాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగువారు శైవ మందిరాలకు వెళ్లి శివలింగ దర్శనం చేసుకున్నారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అతిపురాతన చంద్రశేఖర స్వామి వారిని భక్తులు దర్శించుకుని అభిషేకాలు చేశారు. రామసాగరం వద్ద రామలింగేశ్వర ఆలయంలో తెలుగు వారు వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు.
కాలువలో ఎలుగు పిల్లలు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి బి.సింగపూర్ గ్రామం పంచాయతీలో గల తెలింగిరి పాగునీటి కెనాల్‌లో పడి రెండు ఎలుగు బంటి పిల్లలు చిక్కుకున్నాయి. వాటిని చూచిన గ్రామస్తులు వాటిని అతి కష్టంతో రక్షించారు. సమీప అడవి నుంచి తల్లి ఎలుగు తన రెండు పిల్లలతో బిసింగపూర్ గ్రామ సమీపంలో గల తెలింగిరి కెనాల్ పక్క నుంచి ఆహారం కోసం వస్తుండగా ప్రమాదవశాత్తు రెండు ఎలుగు పిల్లలు కెనాల్‌లో పడిపోయాయి. దీంతో ఎలుగు హాహాకారాలు చేసింది. ఎలుగు ఆర్తనాదాలు విన్న గ్రామస్తులు వాటిని కర్రలతో అతి కష్టంతో చాకచక్యంగా రక్షించి విడిచి పెట్టారు. అవి అడవి మార్గంలో వెళ్లిపోయాయి. అయితే ఎలుగులు తరచూ సంచరిస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎలుగు దాడిలో మరణాలు కూడా గతంలో సంభవించాయి.
రోడ్డు ప్రమాదంలో
బాలుని మృతి
రాయగడ: రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. మృతుడిని కాశీపూర్‌లోని ఖుంటియావీధికి చెందిన దయా బీసీ కొడుకు జితు బిసి(12)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆదివారం రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. జితు సమీపంలో గల మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు ఖరీదు చేసుకుని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొంది. దీంతో తీవ్రగాయాలకు గురై కిందపడిపోయాడు. అప్పటికే అతడు సంఘటన స్థలం వద్ద మృతి చెందినట్లు గుర్తించిన అక్కడి వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గాలిస్తున్నారు.
బైక్ ఢీకొని వృద్ధుడు మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి తామ్సా పంచాయతీ ఎం.వి. 5 గ్రామం వద్ద సోమవారం సాయంత్రం బైక్ ఢీకొన్న సంఘటనలో వృద్ధుడు బైద్య హర్ధార్ (68) మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైద్య హర్ధార్ పొలం పని చేసుకొని సాయంత్రం ఇంటికి వస్తుండగా ఓ యుకుడు మద్యం మత్తులో బైక్‌తో వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో బైద్య హర్ధా ర్ తీవ్రమైన గాయాలతో కిందపడిపోయాడు. స్థానికులు వెంటనే మల్కన్‌గిరి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్ నడుపుతున్న వ్యక్తికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలిసిన మల్కన్‌గిరి ఐఐసీ రరీగాన్ కీఈండో ఆస్పత్రికి చేరుకొని బైద్య హర్ధార్ మృతదేహన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బైక్ నడిపిన యువకుడిపై కేసు నమో చేసినట్టు పోలీసులు తెలిపారు.
భక్తిశ్రద్ధలతో కార్తీక సోమవారం పూజలు
భక్తిశ్రద్ధలతో కార్తీక సోమవారం పూజలు
భక్తిశ్రద్ధలతో కార్తీక సోమవారం పూజలు


