
తల్లికి తనయ తలకొరివి
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ పట్టణంలో సీనియర్ జర్నలిస్ట్ హరిహర సత్ప తి సతీమణి కుంతల కుమారి సత్పతి (56) మృతి బుధవారం చెందింది. అంత్యక్రియల కోసం డీఎన్‌కే శ్మశానాకి తీసుకెళ్లారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలున్నారు. మృతురాలి చిన్న కుమార్తె లోప ముద్ర సత్పతి ముఖాగ్ని పెట్టడానికి ముందుకు వచ్చి ముఖాగ్ని పెట్టింది. జిల్లాలోని మేధావులు, సంఘ సంస్కర్తలు హర్షం వ్యక్తం చేశారు.
భువనేశ్వర్: నీట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షలో కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజీకి చెంది న పూషన్ మహాపాత్రొ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా విద్యార్థిని పలువురు అభినందించారు.
రాయగడ: గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరిని రైల్వే, అబ్కారీశాఖ పోలీసులు బుధవా రం అరెస్టు చేశారు. వారి నుంచి 23.140 కిలో ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో కంధమాల్ జిల్లాకు చెందిన నివేదిత్ శెఠి, సుభస్మిత డెహురి ఉన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి గంజాయి అక్రమ రవాణా జరుతున్నట్లు అందిన సమా చారం మేరకు స్థానిక అబ్కారీ సిబ్బంది, రైల్వే పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడు చేపట్టారు. ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి బ్యాగులను తనిఖీ చేశారు. అందులో గంజాయి పట్టుబడింది. యువకుడు, యువతి ఈ గంజాయిని బెంగుళూరు తరలించేందుకు రైల్వే స్టేషన్ వద్ద వేచి ఉన్న సమయంలో నిర్వహించిన దాడుల్లో పట్టుబడ్డారు.
మునిగుడలో..
జిల్లాలోని మునిగుడ రైల్వే స్టేషన్‌లో బుధవా రం అబ్కారీ, రైల్వే పోలీసులు నిర్వహించిన దాడుల్లో 45 కిలోల గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
జయపురం: స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ యువతకు మార్గదర్శకులని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. బుధవారం రాజీవ్‌గాంధీ 81వ జన్మదినోత్సవాన్ని స్థానిక కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ భవనంలో ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కొరాపుట్ జిల్లా మైనారిటీవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు హసన్ మదాని మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ యువతరానికి మార్గదర్శకులన్నారు. ప్రధాన మంత్రిగా దేశానికి, ముఖ్యంగా పేద, బడుగు వర్గాల ప్రజల ఆర్థిక సామాజిక ఉన్నతికి పలు పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలనకు ఆయన చేపట్టిన పథకాలు నేటికీ ప్రజలు మరువలేనివని అన్నారు. నేటి యువత రాజీవ్‌గాంధీ అడుగు జాడలలో నడచి దేశ సమగ్రతకు, సమైఖ్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొరాపుట్ ఎంపీ జయపురం ప్రతినిధి కృష్ణ చంద్రనేపక్, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కాంత పాఢీ, కొరాపుట్ జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు రామ నాయిక్ పాల్గొన్నారు.
మెళియాపుట్టి: మండలంలోని గోకర్ణపురం గ్రామ పంచాయతీ చినహంస గ్రామానికి చెందిన లండ రామారావు అనే వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. ఒడిశాలోని రాధా సాగరంలో రామారావు గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం మృతదేహం ఒడ్డుకు కొట్టుకురావడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఒడిశా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పర్లాకిమిడి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృత్యువాతపడడంతో భార్య లక్ష్మి రోదనలు మిన్నంటాయి.

తల్లికి తనయ తలకొరివి

తల్లికి తనయ తలకొరివి

తల్లికి తనయ తలకొరివి

తల్లికి తనయ తలకొరివి