
రెవెన్యూ మినిస్టీరియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధు
జయపురం: కొరాపుట్ జిల్లా రెవెన్యూ మినిస్టీరియ ల్ ఆఫీసర్స్ అసోసియేషన్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఒడిశా అమలా సంఘ ఆఫీసర్స్ అసోసి యేషన్ సాధారణ కార్యదర్శి శశిభూషణ దాస్ ఆరోపించారు. సోమవారం ఉదయం జయపురం బ్లాక్ ఎడ్యకేషనల్ ఆఫీసర్స్ కార్యాలయంలో నిర్వహించి న పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం కొరాపుట్ జిల్లా రెవెన్యూ మినిస్టీరియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా పిలవబడుతున్న వ్యక్తులు డి.ఎన్. కె సద్భావణ భవనం కొరాపుట్‌లో తమ డిమాండ్ ను నెరవేర్చుకొనేందుకు ఒడిశా అమలా సంఘం పేరుని, బేనర్, రిజిస్ట్రేషన్ నంబర్‌ను లెటర్ పేడ్ ను, బ్యానర్లను అక్రమంగా వినియోగించి సమావే శం నిర్వహించారని ఆరోపించారు. వారి చర్య చట్టవిరుద్ధమని నిందించారు. ఒడిశా అమలా సంఘ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆవిధమైన సమావేశం నిర్వహించమని ఏ జిల్లా అమలా సంఘాన్ని ఆదేశించాలని కోరలేదని శశిభూషణ దాస్ వెల్లడించారు. అయితే రెవెన్యూ మినీస్టీరియల్ ఆఫీ సర్స్ అసోసియేషన్ ఒడిశా అమలా సంఘ బేనరు, లెటర్ పేడ్, పేరును అక్రమంగా వాడుకొని ఒడిశా అమలా సంఘాన్ని తప్పుగా నిలబెట్టేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ఈ విషయం తాము కొరాపుట్ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసినట్టు చెప్పార. అక్రమ చర్యకు పాల్పడిన రెవెన్యూ అమలా సంఘ్ ఆఫీసు బేరర్సు మనోజ్ కుమార్ బారిక్, నిత్యానంద బ్రహ్మలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవా లని కోరామన్నారు. సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి సంజయ కుమార్ పండ, సీనియర్ సభ్యులు వై.శ్రీనివాసరావు, కై లాష చంద్ర సామంతరాయ్, జగన్నాఽథ్‌దాస్ ఉన్నారు.