పూరీ తొక్కిసలాట దర్యాప్తు నివేదిక దాఖలు | - | Sakshi
Sakshi News home page

పూరీ తొక్కిసలాట దర్యాప్తు నివేదిక దాఖలు

Aug 1 2025 12:29 PM | Updated on Aug 1 2025 12:29 PM

పూరీ

పూరీ తొక్కిసలాట దర్యాప్తు నివేదిక దాఖలు

భువనేశ్వర్‌: పూరీ శ్రీ జగన్నాథుని రథ యాత్ర సందర్భంగా గుండిచా మందిరం ప్రాంగణం శారదా బాలిలో విచారకర తొక్కిసలాట సంఘటన జరిగిన విషయం విదితమే. ఈ సంఘటనపై అభివృద్ధి కమిషనర్‌ అనూ గర్గ్‌ గురువారం లోక్‌ సేవా భవన్‌లో ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝికి దర్యాప్తు నివేదిక సమర్పించారు. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం చర్యల పట్ల అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ ఏడాది జూన్‌ 29 తెల్లవారుజామున శారదా బాలిలో తొక్కిసలాట జరిగింది. ఈ దురదృష్టకర సంఘటనలో మొత్తం 3 మంది భక్తులు మరణించారు. చాలా మంది భక్తులు గాయపడ్డారు. దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అభివృద్ధి కమిషనర్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన కమిటీలో 4 మంది ఓఏఎస్‌ అధికారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మానస్‌ రంజన్‌ సామల్‌, బినయ్‌ కుమార్‌ దాస్‌, రష్మి రంజన్‌ నాయక్‌ మరియు ప్రదీప్‌ కుమార్‌ సాహులను దర్యాప్తు బందంలో చేర్చింది.

పూరీ తొక్కిసలాట దర్యాప్తు నివేదిక దాఖలు1
1/1

పూరీ తొక్కిసలాట దర్యాప్తు నివేదిక దాఖలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement