
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి కృష్ణానగర్ గ్రామ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. మృతుల్లో విశ్వజిత్ (29), జోగేష్ మినియాక (32)లు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న కల్యాణ సింగుపూర్ ఐఐసీ నీలకంఠ నాయక్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి నాయక్ తెలియజేసిన వివరాల ప్రకారం.. రైల్వే కార్మికుడిగా పనిచేస్తున్న విశ్వజిత్ పనులు ముగించుకుని సికరపాయి నుంచి రాయగడకు వస్తున్నాడు. ఈ క్రమంలో కృష్ణానగర్ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నీలగిరి కర్రల లోడుతో ట్రాక్టర్ ఆగి ఉంది. ట్రాక్టర్ డ్రైవర్ జోగేష్ మినియాక రోడ్డుకు పక్కగా నిలుచున్నాడు. అతివేగంతో బైకుపై వస్తున్న విశ్వజీత్ అదుపు తప్పి ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు. దీంతో ట్రాక్టర్ సమీపంలో నిల్చున్న జోగేష్‌తో పాటు విశ్వజీత్‌కు తీవ్రగాయాలవ్వడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం