భళా.. మామిడి పండ్ల మేళా | - | Sakshi
Sakshi News home page

భళా.. మామిడి పండ్ల మేళా

Jun 28 2023 2:20 AM | Updated on Jun 28 2023 8:54 AM

- - Sakshi

జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ వద్ద ఓర్మాస్‌ సంస్థ ఆధ్వర్యంలో మామిడి పండ్ల మేళాను కలెక్టర్‌ స్మృతిరంజన్‌ ప్రధాన్‌, ఎస్‌డీసీ చైర్మన్‌ మరియం రైయితోలు మంగళవారం ప్రారంభించారు. ఈనెల 29 వరకు మొత్తం మూడు రోజుల పాటు మేళా జరుగుతుందని అధికారులు తెలియజేశారు. మేళాలో గజపతి జిల్లాలో పండిన మామిడిపండ్లతో పాటు కొరాపుట్‌, అనుగుల్‌, బలంగీర్‌, కలహండి, రాయగడ, సంబల్‌పూర్‌ జిల్లాల నుంచి వేర్వేరు రకాలు మామిడి పండ్ల ఉన్నాయి.

ముఖ్యంగా ఆమ్రపళ్లి, లెంగడా, దశరీ, బంగినపళ్లి, ఏనుగు తలకాయలు, మల్లికా రకాలు ఉన్నాయి. స్టాల్స్‌ను ఉద్యానవన శాఖ అధికారి సుశాంత రంజన్‌ మఝి, డిప్యూటీ డైరక్టర్‌ సుశాంత రంజన్‌ దాస్‌, ఓర్మాస్‌ దిలీప్‌ కుమార్‌ సాహు, ఒడిశా జీవనోపాధుల శాఖ డీపీఎం ప్రియంవద బిసాయి, మిషన్‌ శక్తి డీపీఏ మనస్మితా పాత్రో తదితరులు పాల్గొన్నారు. – పర్లాకిమిడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement