
చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి విజయలక్ష్మి ఉదయం వెళ్లడం, సాయంత్రం ఇంటికి రావడం చేస్తుండేది.
విజయనగరం: భర్తను హతమార్చిన కేసులో కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన ముద్దాయి అడ్డూరి విజయలక్ష్మికి జీవిత ఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.కల్యాణ చక్రవర్తి మంగళవారం తీర్పు చెప్పారు. అనాథలైన ఇద్దరు పిల్లలకు చెరో రూ.మూడు లక్షల పరిహారం ప్రభుత్వం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేలూరి రఘురాం అందించిన వివరాలిలా ఉన్నాయి, ముద్దాయి భర్త దే ముడు కొత్తవలస గ్యాస్ కంపెనీలో పనిచేసేవాడు.
సుమా రు 14 ఏళ్ల క్రితం విజయలక్ష్మితో పెళ్లయింది. అనంతరం వారికి ఒక అమ్మాయి, అబ్బాయి పుట్టారు. ఇదిలా ఉండగా భార్య విజయలక్ష్మి పరాయి వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త తరచూ తగాదా పడుతుండేవాడు. దీంతో పాటు చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి విజయలక్ష్మి ఉదయం వెళ్లడం, సాయంత్రం ఇంటికి రావడం చేస్తుండేది. ఈ విషయమై భార్యను పలుమార్లు నిలదీశాడు. ఈ నేథ్యంలో భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న విజయలక్ష్మి 2019 సెప్టెంబర్ 2న రాత్రి భర్త పొట్టపై కత్తితో దాడి చేసింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దేముడు చికిత్స పొందుతూ మరునాడు మృతిచెందాడు. మృతుడి సమీప బంధువు మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు కొత్తవలస ఎస్సై బి. మురళి కేసునమోదు చేసి నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి సీఐ జి.గోవిందరావు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ 18 మంది సాక్షులను కోర్టులో విచారణ చేసి అభియోగం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.