శబర శ్రీక్షేత్ర, కొరాపుట్ పుస్తకావిష్కరణ
జయపురం: జయపురానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు, ఆదివాసీ జీవనం, సంస్కృతి, సంప్రదాయాల పరిశోధకుడు, అవిభక్త కొరాపుట్ చరిత్ర పలు పుస్తకాలు రచించిన డాక్టర్ పరేష్ రథ్ కొరాపుట్ శబరి శ్రీక్షేత్రపై రచించిన శబరి శ్రీక్షేత్ర, కొరాపుట్ పుస్తకాన్ని మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు.శబర శ్రీక్షేత్ర విద్యాపీఠం, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాయం, పూరీ పండితులు సంయుక్తంగా కొరాపుట్ ఆదివాసీ సంగ్రాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి శబరశ్రీక్షేత్ర దివ్య పీఠ అధ్యక్షులు, జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రెండు రోజులు జరిగిన శ్రీజగన్నాథ సంస్కృతి, ఆదివాసీ సంస్కృతిలపై జరిగిన చర్చావేదికపై ‘శబర శ్రీక్షేత్ర కొరాపుట్ ’పుస్తకాన్ని జయపురం ఎమ్మెల్యే బాహిణీపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రచయిత డాక్టర్ పరేష్ రథ్ 2016లో శబరి శ్రీక్షేత్రం కొరాపుట్‌పై ఒడియాలో రచించారన్నారు. రాష్ట్ర వాసులే కాకుండా దేశ, విదేశీయులు కొరాపుట్ శబరి శ్రీక్షేత్రం ప్రాధాన్యత తెలుసు కొనేందుకు వీలుగా ఆంగ్లంలో రచించటం ప్రశంసనీయమన్నారు. డాక్టర్ రథ్ అవిభక్త కొరాపుట్ ఆదివాసీ సంస్కృతిపై పలు పండుగలపై అనేక రచనలు చేశారని వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డాక్టర్ పరేష్ రథ్‌ను ఎమ్మెల్యే బాహిణి పతి ఘనంగా సన్మానించారు.
శబర శ్రీక్షేత్ర, కొరాపుట్ పుస్తకావిష్కరణ


