
ఒడిశా: మండలంలోని పారాదిలో ఆదివారం ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో భర్తే హంతకుడిగా పోలీసుల విచారణలో వెల్ల డైంది. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ పుల్లూరు శ్రీధర్, సీఐ ఎం నాగేశ్వరరావులు సోమవారం సాయంత్రం విలేకరులకు వివరించా రు. బాడంగి మండలం డొంకిన వలసకు చెందిన పూడి శంకరరావు కుమార్తె గౌరీశ్వరి అలియాస్ విజ యను పారాది గ్రామానికి చెందిన సూర్రెడ్డి రవికి ఇచ్చి 11 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరు టీ కొట్టు నడుపుతూ జీవిస్తున్నారు.
వారికి 9, 10 సంవత్సరాల వయసు గల కుమారుడు, కుమార్తె ఉన్నా రు. కొన్నాళ్లుగా రవి వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై గౌరీ శ్వరి తరచూ భర్తతో గొడవ పడుతుండేది. ఆదివా రం కూడా వీరిద్దరూ వారి దుకాణం వద్దే తీవ్రంగా గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో గౌరీశ్వరి తండ్రి శంకరరావుకు ఫోన్ చేసి భర్తతో వేగలేకపోతున్నానని, పరిస్థితి బాగాలేదు రమ్మని సమాచారమిచ్చింది.
తండ్రి కళ్లముందే మృతి చెందిన కుమార్తె
వెంటనే శంకరరావు కుమార్తె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో భార్యాభర్తలు గొడవ పడుతుంటే శంకరరావు వారిని సముదాయిస్తూ, పరిష్కారం కోసం ప్రయత్నిస్తుండగానే రవి గౌరీశ్వరిని చెక్కపేడుతో మొఖం, మెడపై తీవ్రంగా కొట్టడంతో ఆమె పక్కనే ఉన్న మంచంపై రక్తం కక్కుకుంటూ ప్రాణా లు విడిచింది. అనంతరం ఆమె చనిపోయిందని తెలుసుకున్న రవికుమార్ గ్రామం పక్కనే ఉన్న హైస్కూల్‌లో దాక్కున్నాడు.
గ్రామస్తుల సమాచా రం మేరకు పోలీసులు రవిని పట్టుకుని స్టేషన్‌కు తరలించి, గౌరీశ్వరి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీఐ ఎం.నాగేశ్వర రావు, సిబ్బంది విచారణలో గౌరరీశ్వరిని భర్త ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. నిందితుడు భర్త రవిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని. సోమవారం కోర్టులో హాజ రు పరిచినట్లు తెలిపారు.