ఓటెత్తాలి! | - | Sakshi
Sakshi News home page

ఓటెత్తాలి!

Nov 26 2026 1:41 AM | Updated on Nov 26 2026 1:41 AM

ఓటెత్తాలి! నేడు తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫీజు చెల్లింపునకు వచ్చేనెల 5 వరకూ అవకాశం మచిలీపట్నంఅర్బన్‌: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి ఎస్‌ఎస్‌సీ, ఓఎస్‌ఎస్‌సీ, వొకేషనల్‌ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రెగ్యులర్‌ విద్యార్థులతో పాటు ఒకసారి పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు(వన్‌టైమ్‌ ఫెయిల్డ్‌) కూడా ఈ షెడ్యూల్‌ ప్రకారం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా గురువారం నుంచి డిసెంబర్‌ 5వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 6 నుంచి 9వ తేదీ వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 10 నుంచి 13వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 14 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. పరీక్ష ఫీజులను ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించి, సంబంధిత వివరాలను ధ్రువీకరించుకోవాలని సూచించారు. పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెరగాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెలివరీలను మరింతగా పెంచాలని ఎన్టీఆర్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఎ. శ్రావణ్‌బాబు అన్నారు. రోగి కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలోని జి. కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఏఎన్‌ఎంలు, ఆశాలు, ల్యాబ్‌ టెక్నీషియన్‌లతో బుధవారం డీఎంహెచ్‌ఓ సెక్టార్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ ఐడీతో గర్భిణుల రిజిస్ట్రేషన్‌, వ్యాధి నిరోధక టీకాల సెషన్ల నిర్వహణ, సెషన్లలో అనాఫిలాక్సిన్‌ కిట్లు, ప్రధాన కార్యాలయంలో ఏఈఎఫ్‌ఐ కిట్‌ను అందుబాటులో ఉంచడంపై వివరించారు. అలాగే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ ప్రయోజనాలను ఏఎన్‌ఎంలకు వివరించారు. ఇ–సంజీవనితో ప్రజలకు, ఆరోగ్య సిబ్బందికి కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఆంజనేయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 29న ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ నేడు రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం సం‘గ్రామానికి’ సర్వం సిద్ధం.. ఉల్లంఘనలపై కఠిన చర్యలు..

న్యూస్‌రీల్‌

వివాదాలకు కేంద్రంఽగా..

సమర్థంగా నిర్వహించాలి..

సమయం ఏదైనా

అందుబాటులో లిక్కర్‌

విజయవాడలో ఏరులై

పారుతున్న మద్యం

నేడు తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు

గురువారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పోరంకిలోని గ్రీన్‌ స్కూల్‌ ఆవరణలో ఈ నెల 29న ఏపీ స్టేట్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని కృష్ణాజిల్లా చెస్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఎం.దివ్య చెప్పారు. గ్రీన్‌ స్కూల్‌ ఆవరణలో టోర్నమెంట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుంచి చెస్‌ క్రీడాకారులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనవచ్చన్నారు. ఈ టోర్నమెంట్‌లో ప్రతిభ చూపిన వారికి రూ.60వేల విలువైన బహుమతులను అందజేస్తామని చెప్పారు. గ్రీన్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌ టి.సుజాత మాట్లాడుతూ తమ పాఠశాల ఆవరణలో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌లో ప్రతి గ్రూప్‌లోని మొదటి ఐదుగురు విజేతలకు ప్రత్యేకమైన బహుమతులను అందజేస్తామన్నారు. పాఠశాల వైస్‌ ప్రిన్సిపాల్స్‌ఈ. స్వాతి, కె.చరణ్య వాసవీ, కె.శ్రీదివ్య పాల్గొన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనే వారు ఆదివారం ఉదయం 8.30కు వేదిక దగ్గర రిపోర్ట్‌ చేయాలని, వివరాలకు 97007 75220లో సంప్రదించాల్సిందిగా కోరారు.

చిలకలపూడి(మచిలీపట్నం): రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా వ్యాప్తంగా రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం నిర్వహించాలని కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. రాజ్యాంగ దినోత్సవానికి రాష్ట్ర, జిల్లా, డివిజన్‌, మండల స్థాయిల్లో ఘనంగా నిర్వహించి పౌరులు, ముఖ్యంగా యువత చురుకుగా పాల్గొనేలా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, యువజన వ్యవహారాలశాఖ సూచించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్థానిక సంస్థల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యాశాఖాధికారులు అన్ని పాఠశాలు, కళాశాలల్లో ఉదయం 11 గంటలకు రాజ్యాంగ పీఠిక సామూహికపఠనం నిర్వహించి విద్యార్థుల గరిష్ట భాగస్వామ్యాన్ని నిర్ధారించాలన్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి దశలో విజయవాడ డివిజన్‌ పరిధిలోని 4 మండలాలు, తిరువూరు డివిజన్‌లోని రెడ్డిగూడెం మండలంలోని మొత్తం 73 గ్రామ పంచాయతీ సర్పంచ్‌, 856 వార్డులకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో జి.కొండూరు మండలంలో 22 పంచాయతీల్లో 224 వార్డులకు, ఇబ్రహీంపట్నం మండలంలో 10 పంచాయతీల్లో 116 వార్డులకు, మైలవరం మండలంలో 13 పంచాయతీల్లో 154 వార్డులకు, విజయవాడ గ్రామీణ మండలంలో 16 పంచాయతీల్లో 226 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తిరువూరు రెవెన్యూ డివిజన్‌ రెడ్డిగూడెం మండలంలో 12 పంచాయతీల్లో 136 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశ ఎన్నికలకు 1,001 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 26వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. కాగా తొలి దశలో ఇప్పటికే 5 పంచాయతీ సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. బుధవారం విజయవాడ రూరల్‌కు సంబంధించి విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ తొలిదశలో విజయవాడ రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సుమారు 9వేల మంది అధికారులు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూస్తున్నామని, సున్నిత, అత్యంత సున్నిత కేంద్రాల్లో 600 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడంతో పాటు వెబ్‌క్యాస్టింగ్‌కు కూడా ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీతో నిరంతర నిఘా, పర్యవేక్షణకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కౌంటింగ్‌కు ఇబ్బందిలేకుండా నిరంతర విద్యుత్‌ సరఫరాతో పాటు అవసరమైన లైటింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఘటనలను ఉపేక్షించకుండా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలకు సంబంధించి సమాచారం లేదా ఫిర్యాదులకు కలెక్టరేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం 91549 70454లో సంప్రదించవచ్చని కలెక్టర్‌ లక్ష్మీశ సూచించారు. కలెక్టర్‌ వెంట విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను తదితరులు ఉన్నారు.

ఇబ్రహీంపట్నంలో ఎన్నికల సామగ్రిని తీసుకెళ్తున్న సిబ్బంది

విజయవాడ సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద సామగ్రి తీసుకుంటున్న సిబ్బంది

సిటీ తూగుతోంది!

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి పాలనలో ప్రజలు తాగేందుకు స్వచ్ఛమైన మంచినీరు దొరక్కపోయినా, కానీ మద్యం మాత్రం ఎనీటైం దొరుకుతోంది. అర్ధరాత్రి దాటినా, వేకున జామైనా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం ఎక్కడైనా దొరుకుతోంది. నగరంలో ఎనీటైమ్‌ మద్యం(ఏటీఎం) వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి వైన్‌షాపులు, బార్‌లు మూయాల్సి ఉన్నా, మామూళ్ల మత్తులో జోగుతున్న పోలీస్‌, ఎకై ్సజ్‌ యంత్రాంగం వాటివైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో అక్రమ మద్యం వ్యాపారం నిరంతరాయంగా కొనసాగుతోంది. నగరంలోని 59 వైన్‌షాపులు, 105 వరకూ బార్‌లు ఉన్నాయి. వాటిలో అధిక శాతం వాటిలో ఇలాంటి విక్రయాలు సాగుతూనే ఉన్నాయి.

ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటు..

నగరంలోని వైన్‌షాపులు, బార్‌ల వద్ద అక్రమ మద్యం వ్యాపారం కోసం బడ్డీ కొట్టు టైప్‌లో ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటు చేశారు. దీంతో సమయం ముగిసిన తర్వాత షాపు షట్టర్‌ మాత్రమే వేస్తారు. కానీ పక్కన ఉన్న కౌంటర్‌ ద్వారా వ్యాపారం సాగుతూనే ఉంటుంది. అర్ధరాత్రి, వేకువజాము, ఉదయం అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా ప్రత్యేక కౌంటర్‌లలో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. అంతేకాదు సమయం ముగిసిన తర్వాత జరిపే విక్రయాలకు అధిక ధరలు వసూళ్లు చేస్తుంటారు. అలా ఒక్కో ప్రాంతంలో ఒకలా ధరలు ఉంటున్నాయి.

అధికారులు షరా‘మామూళ్లే’..

మద్యం షాపుల్లో అర్ధరాత్రి దాటినా అమ్మకాలు సాగిస్తున్నా పోలీస్‌, ఎకై ్సజ్‌ అధికారులు తమకేమి తెలియనట్లు మిన్నకుండి పోతున్నారు. అందుకు నెలనెలా వారికి అందుతున్న మామూళ్లే కారణం అంటున్నారు. వ్యాపారాన్ని బట్టి నగరంలోని వైన్‌షాపుల నుంచి ప్రతి నెలా రూ.50వేల నుంచి రూ.70వేల వరకూ ముడుపులు అందుతున్నట్లు సమాచారం. వాటిలో ప్రజా ప్రతినిధులకు వాటా వెళ్తున్నట్లు చెబుతున్నారు. దీంతో రేట్లు పెంచి అమ్ముతున్నా, అర్ధరాత్రి దాటిన తర్వాత విక్రయాలు జరిపినా తమకేమి పట్టనట్లు మిన్నకుండి పోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అర్ధరాత్రి దాటినా మద్యం విక్రయాలు జరుపుతుండటంతో ఆ సమయంలో మద్యం తాగిన యువత వల్ల నిత్యం వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ఇటీవల లబ్బీపేట వాటర్‌ ట్యాంక్‌ రోడ్డులో అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ గోల్డ్‌ షాపులో పనిచేసే యువకులు, ఆ ప్రాంతంలో స్థానికంగా ఉండే వారి మధ్య మద్యం మత్తులో వివాదం జరిగింది.

రాణీగారితోట బాలాజీ నగర్‌లో ఉదయం 6 గంటలకే మద్యం విక్రయాలు జరుపుతుండటంతో ఇటీవల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరగడుపునే మద్యం తాగుతున్నారని, అందుకు వైన్‌షాపుల్లో విక్రయాలే కారణమంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు చిట్టినగర్‌, సింగ్‌నగర్‌ ప్రాంతాల్లో సమయం ముగిసిన తర్వాత మద్యం తాగి, ఆ మత్తులో వివాదం చోటుచేసుకుని ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడిన ఘటనలు కూడా ఇటీవల చోటుచేసుకున్నాయి.

అర్ధరాత్రి దాటినా

ఆగని మద్యం అమ్మకాలు

నిత్యం వేకువజాము నుంచే

అమ్మకాలు ప్రారంభం

మామూళ్ల మత్తులో ఎకై ్సజ్‌,

పోలీసు శాఖలు

ప్రతినెలా ఒక్కో వైన్‌ షాపు నుంచి

రూ. 70వేల వరకూ వసూళ్లు

వాటిలో ప్రజాప్రతినిధులకు వాటాలు

ఇబ్రహీంపట్నం: మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొండపల్లి జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఎన్నికల విధులను సమర్థంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

జిల్లాలోని 73 పంచాయతీలు,

856 వార్డు స్థానాల్లో పోలింగ్‌

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

9వేల మంది అధికారులు, సిబ్బంది

డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని సందర్శించిన

కలెక్టర్‌ లక్ష్మీశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement