ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోండి

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోండి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని

చిలకలపూడి(మచిలీపట్నం): ఉచిత న్యాయ సహాయ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ సి. యామిని సూచించారు. న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో గల న్యాయ సేవా సదన్‌ నుంచి జిల్లా కోర్టు సెంటర్‌ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ పథకాల ద్వారా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, యాసిడ్‌ దాడుల బాధితులు, అసంఘటిత రంగ కార్మికులు తదితర వర్గాలకు న్యాయ సహాయంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

డిసెంబర్‌ 12న లోక్‌ అదాలత్‌..

ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ల ద్వారా పెద్ద సంఖ్యలో కేసులను పరిష్కరిస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు. డిసెంబర్‌ 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో అమలవుతున్న మధ్యవర్తిత్వం 3.0 కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 140కి పైగా కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు. పోక్సో కోర్టు న్యాయమూర్తి జి. వెంకటేశ్వర్లు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్‌. వరలక్ష్మి, అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి సి. యుగంధర్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం. రహమతుల్లా, మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి పి. సాయి సుధ, జేఎఫ్‌సీఎం స్పెషల్‌ మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి జె.బి.టి.ఎస్‌. దేవి, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.వి.ఎల్‌. హిమబిందు తదితర న్యాయాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement