నేటి నుంచి కార్తికమాస పూజలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కార్తికమాస పూజలు

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

నేటి నుంచి కార్తికమాస పూజలు

పెనమలూరు: యనమలకుదురు కొండ పై వేంచేసి ఉన్న శ్రీపార్వతీ సమేత శ్రీరామలింగేశ్వరస్వామివారి దేవస్థానంలో కార్తికమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. కార్తికమాసం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. సర్వదోశ నివారణకు శ్రీరామలింగేశ్వరస్వామి వారికి నెల రోజుల పాటు పరోక్ష గోత్రనామాలతో పూజలు చేస్తారు. వచ్చే నెల 8వ తేదీ వరకు ఈ పూజలు కొనసాగుతాయి.

కార్తికమాసంలో విశేష రోజులివే..

కార్తికమాసం విశేష రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయంలో 13వ తేదీ నాగులచవితి పండుగ చేస్తారు. ఈ నెల 16వ తేదీన మొదటి సోమవారం స్వామివారికి శాంతికల్యాణం చేస్తారు. 20వ తేదీన ఉదయం భాస్మాభిషేకం, 22వ తేదీ సాయంత్రం నందీశ్వర అభిషేకం, 23వ తేదీ రెండో సోమవారం స్వామివారికి శాంతికల్యాణం చేస్తారు. 24వ తేదీన ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం భక్తుల గిరి ప్రదక్షిణ అనంతరం దీపోత్సవం చేస్తారు. 27వ తేదీన శ్రీపార్వతీదేవిని అన్నపూర్ణదేవి అలంకరణ, శ్రీస్వామివారి జన్మనక్షత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఉదయం 8 గంటలకు అన్నాభిషేకం, 11 గంటలకు అన్న సంతర్పణ చేస్తారు. 30వ తేదీ 3వ సోమవారం స్వామివారికి శాంతికల్యాణం, డిసెంబర్‌ 4వ తేదీన స్వామివారికి బిల్వార్చన, 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు నందీశ్వరస్వామివారికి అభిషేకం, 7వ తేదీ 4వ సోమవారం మాసశివరాత్రి సందర్భంగా స్వామివారికి శాంతికల్యాణం చేస్తారు. 9వ తేదీన ఉద్వాసన, స్వామివారికి ప్రత్యేక అలంకరణ విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రతి రోజు ఉదయం 5 గంటలకు, 6.30 గంటలకు, 8 గంటలకు, 9.30 గంటలకు, 11 గంటలకు స్వామివారికి అభిషేకం చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement