నగరాల ఆడబిడ్డ భాగ్యలక్ష్మికి మద్దతివ్వండి | - | Sakshi
Sakshi News home page

నగరాల ఆడబిడ్డ భాగ్యలక్ష్మికి మద్దతివ్వండి

Oct 19 2026 4:07 AM | Updated on Oct 19 2026 4:07 AM

ఏపీ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బాబూజీ పిలుపు

ఐదు రోజుల దీక్ష చేసినా కూటమి ప్రభుత్వం స్పందించలేదు

నగరంలోఉన్న 60 వేల మంది, రాష్ట్రంలో రెండు లక్షల మంది నగరాలు భాగ్యలక్ష్మి విజయానికి కృషి చేయాలి

నగరాలను బీసీలుగా గుర్తించింది వైఎస్‌ కుటుంబమే

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): వైఎస్సార్‌ సీపీ విజయవాడ మేయర్‌ అభ్యర్థి, నగరాల ఆడబిడ్డ, మాజీ మేయర్‌ రాయన భాగ్య లక్ష్మికి నగరాల సోదర సోదరీమణులందరూ అండగా నిలిచి, ఆమెను మరోసారి బెజవాడ ప్రథమ పౌరురాలిగా నిలబెట్టేందుకు కృషి చేయాలని ఏపీ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బాబూజీ (బాబ్జీ) ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. తమ సమాజానికి వెంటనే బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ లేదా ఇన్‌చార్జి డైరెక్టర్‌ను నియమించాలనే డిమాండ్‌తో ఇటీవల ఐదు రోజుల నిరాహార దీక్ష చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఉన్న నగరాల్లో, విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో మాత్రమే 60 వేల వరకు ఉన్న నగరాల సమాజానికి, బీసీ మంత్రివర్యులు, సంబంధిత అధికారులతో జరిగిన గత మూడు త్రైమాసిక సమావేశాల్లో ప్రాతినిధ్యం లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు.

ఒకప్పుడు నగరాల సమాజానిదే కీలకపాత్ర

ఒకప్పుడు విజయవాడ రాజకీయాల్లో నగరాల సమాజం కీలక పాత్ర పోషించిందని, ఆర్థికంగా బలహీనపడటంతో క్రమంగా రాజకీయ ప్రాధాన్యత కోల్పోయిందని గుర్తుచేశారు. వైఎస్సార్‌ ఉమ్మడి ఏపీలోని ఐదు జిల్లాల్లో తమ సమాజానికి బీసీ–డీ హోదా కల్పించారని, గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, దేవదాయ శాఖ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ సహాయ సహకారాలతో రాయన భాగ్యలక్ష్మికి మేయర్‌గా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. పలు కీలక పదవుల్లో కనకదుర్గ గుడి చైర్మన్‌ పదవి, శ్రీశైలం బోర్డు మెంబర్‌ , శ్రీశైలంలో నగరాల అన్నదాన వసతి సత్రానికి స్థలం కేటాయింపు, బీసీ–డి స్టేటస్‌ని ఏపీలో అన్ని జిల్లాలకు, నగరాల సమాజానికి మంచి ప్రాతినిధ్యం లభించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నగరాల సంఘీయులందరూ ఐక్యంగా నిలిచి, రాయన భాగ్యలక్ష్మికి మద్దతుగా కృషి చేయాలని, దీంతో విజయవాడలో నగరాల సమాజం పూర్వ వైభవాన్ని తిరిగి చాటాలని బాబూజీ పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement