కూటమిలో పోటాపోటీగా నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

కూటమిలో పోటాపోటీగా నామినేషన్లు

Oct 19 2026 4:07 AM | Updated on Oct 19 2026 4:07 AM

కూటమిలో పోటాపోటీగా నామినేషన్లు

తిరువూరు: ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు పురపాలక సంఘ ఎన్నికల్లో కూటమి పార్టీల తరఫున రెబల్స్‌ పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. 28 వార్డులకు టీడీపీ తరఫున 93 మంది, జనసేన నుంచి 17, బీజేపీ నుంచి ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. తిరువూరు పురపాలక సంఘ చైర్మన్‌ పదవిని కూటమి పార్టీలు జనసేనకు కేటాయించగా పసుపులేటి మాధవికి ఆ పార్టీ ‘బీ’ ఫారం ఇచ్చింది. ఆదివారం మాధవి టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతుతో నామినేషన్‌ దాఖలు చేయగా, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెనుమల్లి శ్రావణికి మద్దతు తెలిపి రెబల్‌గా నామినేషన్‌ వేయించారు. వార్డుల్లో సైతం టీడీపీలోని ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు, జనసేన అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. తొలుత జనసేన టికెట్‌ శ్రావణికి ఇచ్చి తర్వాత మాధవి పేరు ప్రకటించడాన్ని ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. జనసేన అధిష్టానం శ్రావణికి టికెట్‌ ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేస్తున్నట్లు కూడా పార్టీ నేతలు చెబుతున్నారు.

రెబల్‌కు మద్దతు తెలిపిన టీడీపీ ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement