కోలాహలంగా బతుకమ్మ సంబరం | - | Sakshi
Sakshi News home page

కోలాహలంగా బతుకమ్మ సంబరం

Oct 19 2026 4:07 AM | Updated on Oct 19 2026 4:07 AM

నాగాయలంక: స్థానిక కృష్ణానది తీరంలో శ్రీరామ పాదక్షేత్రం పుష్కరఘాట్‌ తెలంగాణ ఆడపడుచుల సంప్రదాయ గుండె చప్పుడైన బతుకమ్మ సంబరం ఆదివారం రాత్రి కోలాహలంగా జరిగింది. నాగాయలంక, పరిసర గ్రామాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో బతుకమ్మలతో తరలి రావడంతో రామలింగేశ్వరస్వామి మండపం పక్కన కార్యక్రమం ఏఎంసీ మాజీ చైర్మన్‌ మండవ బాలవర్థిరావు ప్రారంభించారు. తొలుత బంతిపూల బతుకమ్మలతో వినాయకుని గుడి సెంటర్‌ నుంచి ర్యాలీగా మెయిన్‌ ఫెర్రీ రోడ్‌లో కృష్ణానది తీరంలోని శ్రీరామ పాదక్షేత్రం పుష్కర ఘాట్‌కు చేరుకున్నారు. ముందుగా బతుకమ్మలతో శ్రీకనకదుర్గాదేవి దర్శనం చేసి తర్వాత వాటిని ఘాట్‌ ప్రాంగణంలో ప్రత్యేకంగా 10 అడుగుల ఎత్తులో నిర్మించిన భారీ బతుకమ్మ చుట్టూ ఉంచారు. మహిళలు ప్రదక్షిణలు చేస్తూ బతుకమ్మ ఆట పాటలతో నృత్యాలు చేశారు. స్థానిక పారుపూడి సిస్టర్స్‌ ప్రిహాన్స్‌, సృనిసాయి ప్రదర్శించిన సంప్రదాయ కూచిపూడి నృత్యానికి అనుగుణంగా మహిళలు, యువతులు నృత్యాలతో సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను కృష్ణానదిలో వదిలి నిమజ్జనం చేసారు. క్షేత్రం చైర్మన్‌ ఆలూరి శ్రీనివాసరావు, నిర్వహణ సంధానకర్త తలశిల రఘుశేఖర్‌, ఉప్పల లీలాకృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement