భారీ కొండచిలువ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

భారీ కొండచిలువ పట్టివేత

Oct 17 2026 8:18 AM | Updated on Oct 17 2026 8:18 AM

భారీ కొండచిలువ పట్టివేత

పెనమలూరు: పెదపులిపాక గ్రామంలో శుక్రవారం రాత్రి కొండచిలువ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. గ్రామంలో పెద్ద కరకట్ట దిగువున కృష్ణానదికి వెళ్లే మార్గంలో ఖాళీస్థలంలో కొండ చిలువను గ్రామస్తులు చూశారు. కొండచిలువ కోడిని పట్టి మింగసాగింది. ఈ సమాచారం తెలుసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి ఓగిరాల తిరుమల వెంకటరత్నం వెంటనే స్నేక్‌ క్యాచర్‌ ప్రభాకరరావును పిలిపించారు. ఖాళీ స్థలంలో ఉన్న కొండ చిలువను పొక్లయినర్‌ సాయంతో బయటకు తీయగా స్నేక్‌క్యాచర్‌ ప్రభాకర్‌రావు చాకచక్యంగా దానిని పట్టుకున్నారు. కొండ చిలువను మూలపాడులో ఉన్న అటవీ ప్రాంతంలో వదలటానికి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement