అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి

Sep 29 2026 1:39 AM | Updated on Sep 29 2026 1:39 AM

● ఎన్టీఆర్‌ జిల్లా జేసీ ఇలక్కియ ● పీజీఆర్‌ఎస్‌లో 200 అర్జీల స్వీకరణ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ ఎస్‌)లో ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌లో జేసీ ఇలక్కియ అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ప్రతి అర్జీ వెనుక ఒక సమస్యతో పాటు ప్రజల ఆశ, నమ్మకం ఉంటాయన్నారు. సంబంధిత శాఖల అధికారులు అవసరమైన సందర్భాల్లో అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్య స్వరూపాన్ని తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పరిష్కారంలో జాప్యం జరిగితే అందుకు గల కారణాలను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

రెవెన్యూ అర్జీలే అధికం

పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 200 అర్జీలు అందాయని అధికారులు తెలిపారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 67 అర్జీలు ఉన్నాయి. శాఖల వారీగా పోలీసు 29, ఎంఏయూడీ 22, సహకార శాఖ 17, విద్య, డీఆర్‌డీఏ ఏడు చొప్పున, పంచాయతీరాజ్‌, వైద్య–ఆరోగ్య శాఖ ఆరు చొప్పున, కాలుష్య నియంత్రణ మండలికి ఐదు అర్జీలు వచ్చాయి. ఇంట ర్మీడియెట్‌ విద్య, ఉపాధికల్పనకు నాలుగు చొప్పున, విభిన్న ప్రతిభావంతులు, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు మూడు చొప్పున, ఎస్‌జీఎస్‌డబ్ల్యూ, గృహ నిర్మాణం, మహిళా శిశు సంక్షేమం శాఖలకు రెండు చొప్పున అర్జీలు అందాయి. విద్యుత్‌, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌, వ్యవసాయం, బీసీ సంక్షేమం, దేవదాయ, బ్యాంకింగ్‌ సేవలు, మెప్మా, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌, పౌర సరఫరాలు, ఇరిగేషన్‌, సాంకేతిక విద్య, జాతీయ రహదారులు, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లకు ఒక్కో అర్జీ వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎం.లక్ష్మీనరసింహం, పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి జి.జ్యోతి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement