2 నుంచి రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌ | - | Sakshi
Sakshi News home page

2 నుంచి రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌

Sep 29 2026 1:39 AM | Updated on Sep 29 2026 1:39 AM

2 నుంచి రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణాజిల్లా రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌ –2026ను అక్టోబర్‌ 2 నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఉమ్మడి కృష్ణాజిల్లా రోలర్‌ స్కేటింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి డి.శ్రీనివాసరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 2, 3, 4 తేదీల్లో గన్నవరంలోని హరివిల్లు వెంచర్‌ ఆవరణలో స్పీడ్‌ స్కేటింగ్‌ పోటీలు, అక్టోబర్‌ 10వ తేదీన నిడమానూరులోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలో రోలర్‌ హాకీ, ఇన్‌లైన్‌ హాకీ పోటీలు, 11వ తేదీన ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలో ఇన్‌లైన్‌, డౌన్‌లైన్‌, ఇన్‌లైన్‌ ఫ్రీస్టైల్‌, రోలర్‌ ఫ్రీ స్టైల్‌, స్కేట్‌ బోర్డింగ్‌, స్కూటర్‌, డెర్బీ, ఆల్‌పైన్‌ పోటీలు, అక్టోబర్‌ 17వ తేదీన దండమూరి ఇండోర్‌ స్టేడియం వెనుక భాగంలో ఆర్టిస్టిక్‌ ఈవెంట్స్‌ జరుగుతాయని వివరించారు. ఆసక్తి ఉన్న వారు 94907 94399లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. రూ. 11.75లక్షలు పలికిన గణేశుడి లడ్డూ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 500కోట్లు కేటాయించాలి

పెనమలూరు: కానూరులో ఆదివారం రాత్రి గణేశుడి లడ్డూని ఓ భక్తుడు రూ. 11.75లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. గ్రామంలో పెద్ద బావి సెంటర్‌లో ఏర్పాటు చేపిన శ్రీవర సిద్ధి వినాయక మహోత్సవం సందర్భంగా 40 కేజీల స్వామివారి లడ్డూ వేలం నిర్వహించారు. రాయల్‌ ఆంధ్ర కిచెన్‌కు చెందిన మాదు రమేష్‌ లడ్డూని ఏకంగా రూ. 11.75లక్షలకు దక్కించుకున్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 500కోట్లు నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గురజాడ ఆనంద్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్‌కు అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గంలోని పంచ వృత్తుల వారికి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. ఐదు వృత్తులు (మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ) ద్వారా సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి పెద్ద పీటవేయాలన్నారు. సంఘం పునర్వ్యవస్థీకరణ – ఆన్‌లైన్‌ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంఘాన్ని పటిష్టం చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement