విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Sep 11 2026 11:03 AM | Updated on Sep 11 2026 11:03 AM

శుక్రవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 అవగాహన ర్యాలీ భారీ వర్షం ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండాలి

న్యూస్‌రీల్‌

కాగితాలకే పరిమితమైన ఆపరేషన్‌ బుడమేరు హామీ పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినాస్పందించని కూటమి ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముంపు నుంచి విజయవాడను తప్పించే కార్యాచరణ ఏది?

ప్రక్షాళనపై చిత్తశుద్ధి ఏదీ?

ఆక్రమణలను తొలగించాలి

భూములు కొనేవారే లేరు

పులిచింతల సమాచారం

ఆక్రమణలతో చిక్కిన కాలువ

ఎన్టీఆర్‌ జిల్లా
శుక్రవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

7

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆత్మహత్యల నివా రణపై అవగాహన కల్పిస్తూ విజయవాడలో గురువారం ర్యాలీ చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా మెంటల్‌ హెల్త్‌ విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

సాక్షి, విజయవాడ: నగరంలో గురువారం భారీ వర్షం పడింది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 40 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం పడటంతో పలు రోడ్లు నీటమునిగాయి.

కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌

చిలకలపూడి(మచిలీపట్నం): ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అధికారులు సిద్ధంగా ఉండాలని కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో జిల్లా ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ సమావేశాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీ మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో 3,28,072 ఎకరాల్లో వరి సాగు చేశారని, 9,84,216 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో ఏడు లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యని తెలిపారు. కనీస మద్దతు ధర గ్రేడ్‌–ఏ రకం క్వింటాకు రూ.2,461, సాధారణ రకం రూ.2,441గా నిర్ణయించారని పేర్కొన్నారు. ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి సేకరించేందుకు 312 రైతు సేవా కేంద్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పౌర సరఫరాల సిబ్బంది రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్న గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి కనీస మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలు తదితర అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతులు వాట్సాప్‌ నంబరు 73373 59375కు హాయ్‌ మెసేజ్‌ పెడితే నేరుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియకు కావాల్సిన షెడ్యూలు బుకింగ్‌ జరుగుతుందని, ఈ అంశంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు బహిరంగ మార్కెట్‌లో విక్రయించిన వివరాలను ధాన్యం కొనుగోలు పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. రైస్‌ మిల్లర్లు కొనుగోలు కేంద్రం ద్వారా సేకరించిన ధాన్యం రవాణా చేసేందుకు గోనెసంచులు, జీపీఎస్‌తో అనుసంధానం చేసిన వాహనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు కావాల్సిన బ్యాంకు గ్యారెంటీలను అక్టోబర్‌ 15వ తేదీలోపు సమ ర్పించాలని రైస్‌ మిల్లర్లకు సూచించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి సిబ్బందికి మండలాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌ (నంబరు 82476 93551) ఏర్పాటు చేసి సిబ్బందికి విధులు అప్పగించి ధాన్యం కొనుగోలులో వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్‌ఓ టి.శివరామప్రసాద్‌, సివిల్‌ సప్లయీస్‌ డీఎం వరలక్ష్మి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జ్యోతిరమణి, ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, కరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రెండేళ్ల క్రితం బుడమేరు సృష్టించిన బీభత్సం ఇంకా విజయవాడ ప్రజల కళ్ల ముందే కదలాడుతోంది. ఆ విలయంలో పదుల సంఖ్యలో ప్రజలు మృత్యు వాత పడగా.. వేల మంది సర్వం కోల్పోయారు. ప్రజలను ఆదుకోవడంలో, ముందస్తుగా బుడమేరు వరద హెచ్చరికలను జారీ చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విపత్తు సంభవించిన అనంతరం బుడమేరును పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ నీటి మూటగా మారింది. ఆపరేషన్‌ బుడమేరు కాగితాలకే పరిమితమైంది.

దుఃఖదాయనిగా బుడమేరు వాగు

ఆక్రమణలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో బుడమేరు సహజ ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోయింది. ఒకప్పుడు వర్షపు నీటిని పంటపొలాలకు అందించడంతోపాటు సులభంగా కొల్లేరుకు తరలించిన బుడ మేరు ఇప్పుడు భారీ వర్షం కురిస్తే ప్రజల గుండెల్లో భయం పుట్టిస్తూ దుఃఖదాయనిగా మారింది. ఎ.కొండూరు నుంచి విజయవాడ వరకు సుమారు 40 గ్రామాల పరిధిలో 42 కిలోమీటర్ల మేర బుడమేరు పరీవాహక ప్రాంతం ఉంది. విజయవాడలో ఈ వాగు వెడల్పు ప్రాంతాన్ని బట్టి 50 నుంచి 120 అడుగుల వరకు ఉండేది. ఆక్రమణల కారణంగా అనేక ప్రాంతాల్లో చిక్కిపోయింది. ఒక్క విజయవాడ పరిధిలోనే 380 ఎకరాల మేర ఆక్రమణకు గురైనట్లు అంచనా. 2024 ఆగస్టు 31న కురిసిన భారీ వర్షాలకు బుడమేరు డైవర్షన్‌ చానల్‌కు పలు ప్రాంతాల్లో గండ్లు పడటంతో విజయవాడ నగరం గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వరద ముంపును చవిచూసింది. 2,400 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న చోట ఏకంగా 33 వేల క్యూసెక్కుల వరద రావడం, ప్రభుత్వం సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోకపోవడం, డైవర్షన్‌ కెనాల్‌కు గండ్లు పడడం, చివరి క్షణాల్లో వెలగలేరు రెగ్యులేటర్‌ వద్ద గేట్లు ఎత్తివేయడంతో విజయవాడలోని 32 డివిజన్లలో సుమారు 2.62 లక్షల మంది ప్రజలు వరద ముంపులో చిక్కి విలవిల్లాడారు.

డీపీఆర్‌ తయారీకే పరిమితం

బుడమేరులో ఆక్రమణల తొలగింపు, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కోసం స్థలం కేటాయించడం, లేనిపక్షంలో ఇళ్లు నిర్మించి ఇవ్వడం, కాలువ గట్లను పటిష్టం చేయడం, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టడం వంటి పనులు చేపట్టేందుకు రూ.5,222 కోట్లతో ప్రభుత్వం డీపీఆర్‌ రూపొందించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేయకపోవడంతో రెండేళ్ల తర్వాత కూడా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. బలహీనమైన గట్లు, 2,400 క్యూసెక్కుల సామర్థ్యంతో 70 ఏళ్ల క్రితం నిర్మించిన వెలగలేరు రెగ్యులేటర్‌, గండిపడిన ప్రాంతాల్లో ఇప్పటికీ పూర్తికాని పనులే కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో సారి బుడమేరుకు వరద వస్తే నష్టం మరింత భారీగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్‌లో బుడమేరు ఆక్రమణలకు గురికాకుండా చూడటం, విజయవాడ నగరంతోపాటు ఎ.కొండూరు నుంచి కొల్లేరు వరకు పరీవాహక ప్రాంత గ్రామాలు, రైతులు, ప్రజలను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

2024లో బుడమేరుకు భారీ వరద వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రూ.5,222 కోట్లతో ఆపరేషన్‌ బుడమేరు అంటూ ప్రకటించింది. ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేపట్టి వదిలేసింది.

వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కొల్లేరులో కలిసే వరకు బుడమేరులో ఆక్రమణలను తొల గించాలి. డైవర్షన్‌ కెనాల్‌ సామర్థ్యం పెంచాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే మరో సారి బుడమేరు ఉపద్రవం తప్పదు.

– పటాపంచల జమలయ్య,

ఏపీ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి

బుడమేరుకు 2024 ఆగస్టులో వచ్చిన వరదల సమయంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ వెంటనే బుడమేరు ప్రక్షాళన చేస్తామంటూ ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. ఆ తరువాత పనులు చేపట్టకుండా వదిలేసింది. వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి దిగువన విజయవాడ రూరల్‌ ప్రాంతంలో బుడమేరు కనుమరుగైంది. ఆక్రమణలు తొలగించి వాగును పునరుద్ధరించకపోతే భవిష్యత్‌లో మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

– బొర్రా నరేంద్రబాబు, రైతు, కవులూరు గ్రామం, జి.కొండూరు మండలం

బుడమేరుకు వరద రాకముందు వరకు ఎకరం భూమి ధర రోడ్డు పక్కన అయితే రూ.1.5 కోట్లు, లోపల అయితే రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు పలికేది. ప్రస్తుతం కొనేవారే లేరు. బుడమేరు వరద వల్ల నేను ఆరు ఎకరాల్లో వరి పంట నష్టపోయాను. బుడమేరు ప్రక్షాళనపై ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకుంటేనే రైతులు ధైర్యంగా సాగు చేయగలుగుతారు.

– దొడ్డా విష్ణువర్ధన్‌రావు, రైతు, ఆత్కూరు,

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 27.7565 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజిల ద్వారా వెళుతోంది.

బుడమేరు డైవర్షన్‌ చానల్‌ ప్రస్తుత సామర్థ్యం సుమారు 15 వేల క్యూసెక్కులు. దీనిని 37,555 క్యూసెక్కులకు పెంచాలనే ప్రతిపాదన వచ్చినా అమలుకు నోచలేదు. 1964లో నిర్మించిన వెలగ లేరు రెగ్యులేటర్‌ను ఆ తర్వాత ఆధునికీకరించలేదు. అవసరమైన చోట రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మించడం, బుడమేరు ప్రవాహాన్ని విజయవాడకు దూరంగా మళ్లించేందుకు కొత్తగా కాలువ తవ్వకం, బలహీనమైన గట్లను పటిష్టం చేయడం వంటి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. వరదలు వచ్చి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన తర్వాత కూడా వాటిలో చాలా వరకు కాగితాలకే పరిమితమయ్యాయి. సింగ్‌నగర్‌ వంతెన సమీపంలో ఆక్రమణలు ప్రమాదకర స్థాయికి చేరాయి. కాలువలో సగం వరకు ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. సుమారు 3,051 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అంచనా. న్యూ రాజరాజేశ్వరిపేటలో బుడమేరును పూడ్చి చిన్న రేకుల ఇళ్ల నుంచి బహుళ అంతస్తుల భవనాల వరకు నిర్మించారు. నగరంలో బుడమేరును ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తుంటే, గ్రామాల్లో ఆక్ర మించి సాగు భూమిగా మారుస్తున్నారు. వీటి వల్ల నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. విజయవాడ పరిధిలో ఏడు నుంచి పది వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం ఉంటేనే భారీ వర్షాల సమయంలో ముంపు ముప్పు ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement