ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టి

Jun 30 2026 3:11 AM | Updated on Jun 30 2026 3:11 AM

పీజీఆర్‌ఎస్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రెసల్‌ సిస్టమ్‌–పీజీఆర్‌ఎస్‌) ద్వారా అందుతున్న ప్రతి అర్జీపైనా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియ అన్నారు. అర్జీదారులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం జరిగింది.

147 అర్జీలు..

కార్యక్రమంలో జేసీ ఇలక్కియ అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కా ర వేదిక కార్యక్రమంలో మొత్తం 147 అర్జీలు అందా యని తెలిపారు. వీటిలో రెవెన్యూ 37, పోలీస్‌ 25, ఎంఏయూడీ 16, ఏపీ ఎస్‌డబ్ల్యూఆర్‌ఐఈఎస్‌ 12, పంచాయతీరాజ్‌ 11, ఇంకా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 46 అర్జీలను స్వీకరించినట్లు జేసీ తెలిపారు.

ప్రజల నుంచి అర్జీ స్వీకరిస్తున్న జేసీ ఇలక్కియ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement