ఏదైనా షాపులో కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయించినా, వారివద్ద స్టాక్ ఉన్న షాపులు సీజ్ చేస్తాం. ఆహార పదార్థాల తయారీ, అమ్మకం, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు విధిగా ఫుడ్ లైసెన్స్ పొందాలి. ఆ తర్వాత మాత్రమే వ్యాపారం ప్రారంభించాలి. అపరిశుభ్రమైన వాతావరణం కలిగి ఉండటం, హానికరమైన వాతావరణ పరిస్థితులు ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలపై కేసులు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో జరిమానాలు విధించాం.
– బి.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్


