లబ్బీపేట(విజయవాడతూర్పు): G±-t-BÆŠ‡ hÌêÏ ´ùÎ‹Ü MýSÑ$çÙ¯]l-Æó‡-sŒæÌZ ÝùÐ]l$ÐéÆý‡… °Æý‡Ó-íßæ…_¯]l {ç³gê çÜÐ]l$-çÜÅÌS ç³Ç-ÚëPÆý‡ Ðól¨MýS (ï³i-BÆŠ‡-G‹Ü)ÌZ {ç³fÌS ¯]l$…_ ÑÑ«§ýl çÜÐ]l$çÜÅ-ÌSOò³ 79 íœÆ>ŧýl$Ë$ A…§éƇ$$. ´ùÎ‹Ü MýSÑ$-çÙ-¯]lÆŠ‡ G‹Ü.Ñ.Æ>-f-ÔóæQ-Æý‡-»êº$ B§ól-Ô>ÌS Ðól$Æý‡MýS$ yîlïÜï³ G.¼.-sìæ.-G-‹Ü.-E§ýl-Ķæ$-Æ>×ìæ {ç³fÌS ¯]l$…_ AÈjË$ ïÜÓMýS-Ç…-_, ÐéÇ çÜÐ]l$-çÜÅ-ÌS¯]l$ AyìlW ™ðlË$çÜ$-MýS$¯é²Æý‡$. A¯]l…-™èlÆý‡… Ðésìæ° çÜ…º…-«¨™èl G‹Ü-òßæ^ŒlKÌS™ø Ð]l*sêÏyìl ç³Ç-çÙP-Ç…-^éÌS° B§ól-Õ…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> ¿¶æ*, BíÜ¢ ÑÐé-§éË$, ¯]lVýS§ýl$ ÌêÐé§ólÒÌSOò³ 32, ¿êÆ>Å-¿ýæ-Æý‡¢Ë$, MýS$r$…º MýSÌSà-ÌSOò³ BÆý‡$, ️Ñ-Ñ«§ýl Ððl*ÝëÌSOò³ 糨, Ð]l$íßæâê çÜ…º…-«¨™èl ¯ólÆ>-ÌSOò³ BÆý‡$, MösêÏ-r-ÌSOò³ Ð]lÊyýl$, §ö…VýS™èl-¯é-ÌSOò³ Æð‡…yýl$, C™èlÆý‡ çÜÐ]l$çÜÅ-ÌSOò³ 20 íœÆ>ŧýl$Ë$ A…§éƇ$$.
కారులో చెలరేగిన మంటలు
జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని విజయవాడ రోడ్డులో ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద సోమవారం రాత్రి ఓ కారులో మంటల చెల రేగాయి. పట్టణంలోని చెరుకూరివారి వీధికి చెందిన చౌడవరపు సుధీర్ తన కుటుంబ సభ్యులతో కారులో జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లు వైపు వెళ్తున్నారు. పట్టణంలోని విజయవాడ రోడ్డులో ఛత్రపతి శివాజీ విగ్రహం సమీ పంలోకి రాగానే అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమై కిందికి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. కారు వైరింగ్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మంటలు చెలరేగా యని ఫైర్ ఆఫీసర్ తెలిపారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు.
మహిళ ఆత్మహత్య
కృష్ణలంక(విజయవాడతూర్పు): అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర మనస్తాపానికి గురై ఓ మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణలంక పోలీస స్టేషన్ పరిధిలో సోమ వారం జరగింది. పోలీసుల కథనం మేరకు.. దాకమర్రి లక్ష్మి (45), గొల్లా భార్యాభర్తలు. వారు కృష్ణలంక బియ్యంకొట్ల బజార్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మన్‌గా పనిచేస్తూ అదే భవనంలో నాల్గో అంతస్తులోని రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్ని నెలలుగా లక్ష్మి రకరకాల రోగాలతో బాధప డుతూ ఆస్పత్రిలో చూపించుకుని మందులు వాడుతుంది. రోగాలు తగ్గకపోవడంతో ఆ బాధలు తట్టుకోలేక మూడు రోజుల నుంచి చనిపోతానని భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నిస్తుండగా కుటుంబ సభ్యులు కాపడుకుంటున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఎవరి పనుల్లో వారు ఉండగా లక్ష్మి భవనంపై నుంచి రోడ్డు మీదకు దూకింది. కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ కిందకు వెళ్లి చూడగా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు నిందితుల అరెస్టు
పెనమలూరు: దొంగతనాలకు ప్పాడుతున్న ఇద్దరు నిందితులను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ ధర్మేంద్ర సోమవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పెనమలూరుకు చెందిన డి.సాయితేజ (బబ్లూ) (26), విజయవాడ చిట్టినగర్‌కు చెందిన బిరుదుకోట పవన్‌కుమార్ (20), మరో బాలుడు ముఠాగా ఏర్పడ్డారు. వీరు గతంలో పలు దొంగతనాలు, ఏటీఎంల వద్దకు వచ్చిన వారిని మోసగించడం, గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన కానూరులో హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు. కామయ్యతోపు సెంటర్ వద్ద ఉన్న ఏటీఎం వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న బోలెం సుమంత్‌ను నమ్మించి తమకు ఆన్‌లైన్‌లో సొమ్ము బదిలీ చేస్తే చేతికి నగదు ఇస్తామని నమ్మించారు. సుమంత్ ఫోన్‌పే ద్వారా రూ.8 వేలు వారికి బదిలీ చేశాడు. అనంతరం డబ్బులు ఇస్తామంటూ సుమంత్‌ను హోటల్ రూమ్‌కు తీసుకు వెళ్లారు. అక్కడ వారు అతడిని చంపేస్తామంటూ బెదిరించి మరో రూ.14,400 ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. సుమంత్ వద్ద ఉన్న బంగారు గొలుసు, రెండు వెండి ఉంగరాలను దౌర్జన్యంగా లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయటంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కోసం గాలిస్తుండగా ఆదివారం సాయంత్రం నిందితులు డి.సాయితేజ, పవన్‌కుమార్ కానూరు వద్ద పట్టుబడ్డారు. వారి వద్ద 16 గ్రాముల బంగారు గొలుసు, ఎనిమిది గ్రాముల వెండి ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరీని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడైన బాలుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని డీఎస్పీ ధర్మేంద్ర తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు టి.వి.వెంకటేశ్వరరావు, సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.


