ముగిసిన సురభి నాటకోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన సురభి నాటకోత్సవాలు

Jun 30 2026 3:11 AM | Updated on Jun 30 2026 3:11 AM

భూ కైలాస్‌ నాటకంలోని రసవత్తర ఘట్టాలు

విజయవాడ కల్చరల్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, సృజనాత్మక సమితి ఆధ్వర్యంలో వినాయక నాట్యమండలి ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాలు సోమ వారం ముగి శాయి. చివరి రోజు ప్రదర్శించిన భూ కౌలాస్‌ నాటకం ఆద్యంతం అలరించింది. తల్లి కై కసి కోరిక మేరకు శివుడి ఆత్మలింగం కోసం రావణుడు తపస్సు చేయడం, ఆయనలో మాయ ప్రవేశించి మాత పార్వతిని ఇల్లాలిగా కోరుకోవడం, ఆ తర్వాత తప్పు తెలుసుకుని శివుడికి శిరస్సు అర్పించడం, భోళా శంకరుడు ఆత్మలింగం సమర్పించడం, నారదుడి మాయచేత శివలింగం భూమి మీదనే ప్రతిష్ఠం కావడం తదితర అంశాలతో ఈ నాటకం సాగింది. రావణ బ్రహ్మగా దినకర, శివుడిగా శివయ్య, నారదుడిగా పరిమళ, విరూపాక్షుడిగా శుభకర, మండోదరిగా మానస వీణ అద్భుతంగా నటించారు. నాటక అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాల కృష్ణకు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా నిర్వాహకులు సత్కరించారు. మంగళవారం ప్రేక్షకుల కోరిక మేరకు మంగళవారం ప్రత్యేక ప్రదర్శనగా మాజా బజార్‌ నాటక ప్రదర్శ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement