సబ్‌ జూనియర్‌, జూనియర్‌ స్విమ్మింగ్‌ జట్ల ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

సబ్‌ జూనియర్‌, జూనియర్‌ స్విమ్మింగ్‌ జట్ల ఎంపికలు

Jun 29 2026 2:05 AM | Updated on Jun 29 2026 2:05 AM

సబ్‌ జూనియర్‌, జూనియర్‌ స్విమ్మింగ్‌ జట్ల ఎంపికలు

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని గాంధీనగర్‌లో సర్‌ విజ్జి మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో సబ్‌ జూనియర్‌, జూనియర్‌ విభాగాల జిల్లా స్థాయి పోటీలు ఆదివారం జరిగాయి. జూలై 18, 19 తేదీల్లో విశాఖ పట్నంలో జరగనున్న 11వ సబ్‌ జూనియర్‌, జూనియర్‌ అంతర్‌ జిల్లా స్విమ్మింగ్‌ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడానికి క్రీడాకారులను ఎంపిక చేశామని ఎన్టీఆర్‌ జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఐ.రమేష్‌ చెప్పారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులను అసోసియేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కొంగర రవికాంత్‌, స్విమ్మింగ్‌ పూల్‌ ఇన్‌చార్జ్‌ నవీన్‌, కోచ్‌లు ఎం.మాల్యాద్రి, లక్ష్మణ్‌, ఎస్‌కే.రఫీ, ఆర్‌.గౌతమ్‌ అభినందించారు.

ఎంపికై న క్రీడాకారులు వీరే

సబ్‌ జూనియర్స్‌ గ్రూప్‌–1 విభాగంలో జి.జితేంద్ర, కె.శక్తిధర్‌, ఎం.ఎల్‌.గీతిక, ఎన్‌.పవన్‌సరయు, పి.అభిషేక్‌సాయి, గ్రూప్‌–2లో పృధ్వీరాజ్‌, డి.రామస్వామి, కె.ప్రభుసాత్విక్‌, వడ్లమూడి లిపి, ఎం.యజ్ఞసాయి, మహమ్మద్‌ ముజ్‌ఫర్‌, పి.అభిరామ్‌, పి.రమ్యశ్రీ, సానా శ్యామ్‌నాథ్‌ జూనియర్‌ గ్రూప్‌–3లో ఎ.హేమంత్‌రాజ్‌, జి.అక్షయ, బి.నాగ లక్ష్మీ కృతిక, జి.అక్షయ, జి.జతిన్‌, కె.రఘు వెంకట సత్యప్రకాష్‌, కె.వినయ్‌, ఎం.చిత్ర, ఎం.జీసశ్రీ, ఎం.సుజీత, ఎన్‌.పర్ణిక, ఎన్‌టీ నారీష్‌, పి.వెంకట అర్జున్‌, గ్రూప్‌–4 విభాగంలో డి.మను కార్తీక్‌, ఈ.గగన్‌, కె.లోహిత్‌సాయి, కరణం సుమేధ, ఇ.గగన్‌ తేజ్‌, కె.సింధూర, ఎం.చేతన్‌ సాయిశ్రీ, ఎం.హర్షిత, ఎం.రామ్‌మణికంఠ, పి.భార్గవ్‌ సాయి, ఆర్‌.హర్షిత, రీషాన్‌ రాజన్‌, ఎస్‌టీ.అక్షిత్‌, ఎస్‌.యశస్విని దీపిక, సానా అక్షిత్‌, వి.భావన శివగామి, యానా జైన్‌ ఎంపికయ్యారని తెలియజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement